cloudfront

Advertisement


Home > Movies - Press Releases

'నమ్మేలా లేదే' అంటున్న 'రాజావారు రాణిగారు'

'నమ్మేలా లేదే' అంటున్న 'రాజావారు రాణిగారు'

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో బాగా హైలైట్ అయిన పేరు 'రాజావారు రాణిగారు'. పోస్టర్లతో, టీజర్ తో జనాలలో ఆసక్తి రేకెత్తించిందీ చిత్రం. గతవారమే మొదటి పాట ద్వారా ప్రజలకు చేరువైంది. రాజావారు రాణిగారు టైటిల్ సాంగ్ కు విశేషమైన స్పందన రావడంతో చిత్రబృందం ఈ సినిమా లోని రెండో పాటని కూడా విడుదల చేసారు.

జయ్ క్రిష్ సంగీత సారథ్యంలో రూపొందిన 'నమ్మేలా లేదే ..' అనే ఈ మెలోడీ కి కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ పాటకి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని యూనిట్ నమ్మకంగా వుంది.  అనురాగ్ కులకర్ణి గాత్రం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. 'నమ్మేలా లేదే..కల కాదే.. మనసే మేఘమాయే' అంటూ సాగే ఈ పాట సాహిత్యపరంగా కూడా చాలా బావుండటం కలిసొచ్చే అంశం.

.ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్ లు హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మనోవికాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.