cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

రాజావారు హీరోకి మరో సినిమా

రాజావారు హీరోకి మరో సినిమా

రాజావారు..రాణీగారు సినిమాతో చిన్న గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఇతగాడికి మరో సినిమా వచ్చింది. టాక్సివాల హీరోయిన్ ప్రియాంక జవాక్కర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాతో శ్రీధర్ గదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 

రాయచోటి ఎమ్.ఏల్.ఏ శ్రీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మదనపల్లి ఎమ్ఎల్ఏ నవాజ్ బాషా క్లాప్ కొట్టారు.  డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు ఆర్.ఎక్స్ 100 మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫిబ్రవరి చివరివారం నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీధర్ గదె మాట్లాడుతూ రాజావారు రాణిగారు సినిమా తరువాత కిరణ్ అబ్బవరం ఈసినిమాలో మరో డీసెంట్ రోల్ లో నటించబోతున్నాడు. బిటెక్ చదివే అబ్బాయి పాత్రలో కిరణ్ ఈ మూవీలో కనిపించబోతున్నాడు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ టాక్సివాల సినిమా తరువాత ఏ సినిమా ఒప్పుకోలేదు, మా స్క్రిప్ట్ నచ్చి ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించింది. ఆ అమ్మాయి ఈ కాలేజీ స్టూడెంట్ పాత్రలో నటిస్తోంది.

ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన సాయి కుమార్ గారు ఈ సినిమాలో ఎంటర్టైన్ రోల్ లో కనిపించబోతున్నాడు. పంచెకట్టులో రాయలసీమ స్లాంగ్ మాట్లాడే పాత్ర తనదని తెలిపారు.

 


×