cloudfront

Advertisement


Home > Movies - Press Releases

మార్చి 8న `స‌ర్వం తాళ‌మ‌యం`

మార్చి 8న `స‌ర్వం తాళ‌మ‌యం`

సీనియర్ అండ్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్, డైరక్టర్ రాజీవ్ మీనన్ రూపొందించిన సినిమా సర్వం తాళమయం. జి.వి.ప్ర‌కాష్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి జంట‌గా న‌టించారు. మార్చి 8న విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా టీమ్ మొత్తం హైదరాబాద్ తో వచ్చి మీడియాతో ముచ్చటించింది.

రాజీవ్ మీన‌న్ మాట్లాడుతూ ``ఈ చిత్రంలో సంగీతం, మెరిట్‌, గెలుపు ఓట‌ముల గురించి ప్ర‌స్తావించాం. గురుశిష్యుల సంబంధం గురించి కూడా చెప్పాం. ఉమ‌యాళ్‌పురం శివ‌రామ‌న్‌గారి మీద డాక్యుమెంట‌రీ చేస్తున్న స‌మ‌యంలో నాకు ఈ ఆలోచ‌న వ‌చ్చింది. మృదంగం త‌యారుచేసేవాళ్ల‌కు వాయించ‌డం  చేత‌కాదు. ఒక‌వేళ వారేగ‌నుక మృదంగం నేర్చుకుంటే ప‌రిస్థితి ఏంట‌నే విష‌యం మీద ఈ సినిమా చేశాం. ఈ చిత్రం కోసం జి.వి.ప్ర‌కాష్ ఏడాది పాటు ఉమ‌యాళ్‌పురం శివ‌రామ‌న్‌గారి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేశారు. ఈ చిత్రంలో సుమేష్ నారాయ‌ణ్‌, బాంబే జ‌య‌శ్రీతో పాటు చాలా మంది సంగీత విద్వాంసులు న‌టించారు. రెహ‌మాన్‌ సంగీతం చాలా ప్ల‌స్ అయింది.

స్క్రిప్టు రాసుకునే స‌మ‌యంలోన నాకు ఓ బాణీ త‌ట్టింది. దాన్ని రెహ‌మాన్‌గారికి వినిపించాను. ఆయ‌న కూడా పెద్ద మ‌న‌సుతో ఆ ట్యూన్‌ను సినిమాలో ఉంచారు. న‌న్ను `మెరుపుక‌ల‌లు` సినిమాకు ద‌ర్శ‌కుడిని చేసింది కూడా రెహ‌మానే.  దాని త‌ర్వాత `ప్రియురాలు పిలిచింది` పూర్త‌యింది. దాదాపు 19  ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ సినిమా చేశాను. ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేస్తాను.

సంగీతం ప్ర‌ధానంగా ఈ క‌థ‌ను చెప్పాల‌ని అనుకున్న‌ప్పుడు చాలా వ‌ర్క్ చేశాం. ద‌ళిత అంశాన్ని కూడా ట‌చ్ చేశాం. తెలుగులో ఈ నెల 8న విడుద‌ల చేస్తున్నాం. కె.విశ్వ‌నాథ్‌గారు సినిమాను చూసి క్లైమాక్స్ లో క‌ళ్ల‌నీళ్లు పెట్టుకుని నా నుదుటిమీద ముద్దుపెట్టుకున్న స‌న్నివేశాన్ని మ‌ర్చిపోలేను`` అని అన్నారు.

జి.వి.ప్ర‌కాష్ మాట్లాడుతూ ``మామావ‌య్య నా సినిమాకు సంగీతం చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. చాలా బాధ్య‌త‌గా ఈ సినిమాను చేశాను. చాలా ఇంపార్టెన్స్ ఉన్న సినిమా ఇది. సెటిల్ పెర్ఫార్మెన్స్ చేశాం. స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. ఏడాది పాటు మృదంగం నేర్చుకున్నా. ఈ సినిమా చేసిన త‌ర్వాత సంగీత ద‌ర్శ‌కుడిగానూ నాలో చాలా మార్పు వ‌చ్చింది`` అని అన్నారు.

నాయిక అప‌ర్ణ బాల‌ముర‌ళి మాట్లాడుతూ ``రాజీవ్ మీన‌న్‌గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రాగానే అదేదో ప్రాంక్ కాల్‌ అని అనుకున్నాను. కానీ నిజంగా చాలా హ్యాపీగా ప‌నిచేశాను. ఈ చిత్రంలో న‌ర్సుగా సారా అనే పాత్ర చేశాను. సినిమాలో సాఫ్ట్ గా మాట్లాడుతుంటాను. కానీ చాలా స్ట్రాంగ్ పాత్ర చేశాను`` అని అన్నారు.