cloudfront

Advertisement


Home > Movies - Press Releases

శ్రేయాస్ మీడియా 1000 ఈవెంట్

శ్రేయాస్ మీడియా 1000 ఈవెంట్

ఈవెంట్ మేనేజ్ మెంట్ అంటే మాటలుకాదు. మనుగడ మాట ఎలా వున్నా, ఏ మాత్రం తేడా వచ్చినా మాటలు తప్పవు. తెలుగు సినిమా రంగంలో ఫంక్షన్లు అంటే ఏ సంస్థకు ఆ సంస్థే చేసుకుంటున్న రోజుల్లో శ్రేయాస్ మీడియా పుట్టుకు వచ్చింది. అప్రతిహతంగా ముందుకు దూసుకువెళ్లింది. దాంతో శ్రేయాస్ అడుగుజాడల్లో చాలా సంస్థలు పుట్టుకువచ్చాయి. కొన్ని గిట్టాయి. కొన్ని నడుస్తున్నాయి.

అయితే విశేషం ఏమిటంటే, శ్రేయాస్ మీడియా వెయ్యి ఫంక్షన్ ల మైలు రాయిని చేరుకోవడం. సినిమా ఫంక్షన్ ల, షాప్ ల ఓపెనింగ్ లు, పెళ్లిళ్లు, ఇంకా, ఇంకా ఇలా రకరకాలైన 1000 ఫంక్షన్లను విజయవంతంగా నెరవేర్చిన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. వెయ్యో ఫంక్షన్ గా రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లోని వినయ విధేయ రామ అడియో ఫంక్షన్ ను శ్రేయా మీడియా నిర్వహిస్తోంది.

2005లో యాడ్ ఏజెన్సీ గా మొదలైన శ్రేయా మీడియా  పవన్ కల్యాణ్ జల్సా సినిమాతో 2008లో ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తింది. 2012లో శ్రేయాస్ మీడియా గా మారింది. శ్రేయాస్ మీడియా బ్రాండ్ తో జరిగిన తొలి ఆడియో ఈవెంట్... ఇష్క్. ఆ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ నే.

వాస్తావానికి సినిమా ఈవెంట్ అంటే ఎలా ఉండాలో ఓ స్టక్చర్ డిజైన్ చేసింది శ్రేయాస్ మీడియానే. దక్షిణాది సినిమా పరిశ్రమల్లో... మరే భాషలోనూ జరగని విథంగా.. తెలుగులోనే సినిమా ఈవెంట్లను అత్యంత వైభవంగా నిర్వహించే సంస్కృతికి తెరతీసింది శ్రేయాస్ మీడియా. అందుకే షార్ట్ టైమ్ లో వెయ్యి ఈవెంట్లు అంటే దానికి సులువుగానే సాధ్యమైంది.

జగన్ కు ఇప్పటి వరకూ ఒక కథ, ఇక అసలు కథ! ఈవారం స్పెషల్ స్టోరీ 

తెలంగాణలో కాంగ్రెస్ ను లేకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యం