cloudfront

Advertisement


Home > Movies - Press Releases

టెక్నీషియన్లే నిర్మాతలుగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్

టెక్నీషియన్లే నిర్మాతలుగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్

ఎయిర్ టెల్ మోడల్ శ‌షా చెట్రి, ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా న‌రేశ్, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావుర‌మేశ్‌ కీల‌క పాత్రధారులుగా రూపొందుతోన్న రొమాంటిక్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌`. వినాయ‌కుడు టాకీస్ బ్యాన‌ర్‌పై య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ల్పిత కథాంశంతో.. అడివి సాయికిర‌ణ్ ద‌ర్శక‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. ఓ సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో భాగ‌మ‌వ‌డం ఇదే తొలిసారి.

స్టార్ రైటర్ అబ్బూరి రవి గారు ఈ చిత్రానికి రచయితగానే కాకుండా, మొట్ట మొదటి సారిగా పవర్ ఫుల్ విలన్ పాత్రని ఈ చిత్రంలో పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కాశ్మీర్, ఢిల్లీ, లంబసింగి, A.O.B, చింతపల్లి, అరకు, కాకినాడ పోర్ట్, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో సినిమా షూటింగ్ చేశాం... మరో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మంచి ఆర్టిస్టుల‌తో పాటు, టెక్నిక‌ల్ టీం కుదిరింది. ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తామ‌ని న‌మ్మకంగా చెబుతున్నాం`` అని దర్శకుడు సాయికిరణ్ తెలిపారు.