cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

థ్రిల్లర్ 22 టీజర్ బాగుంది-నాగ్

థ్రిల్లర్ 22 టీజర్ బాగుంది-నాగ్

కొత్త దర్శకుడు శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటల అందించి దర్శకత్వం వహించిన సినిమా 22.  రూపేష్ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ '22'.  ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. . తాజాగా ఈ చిత్రం టీజర్ ను సీనియర్ హీరో నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగచైతన్య కూడా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని `22` మూవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ - "అందరికి ఎంతో ఇష్టమైన బి.ఎ.రాజు , జయ ల అబ్బాయి శివ.  వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అంటే చాలా హ్యాపీగా వుంది. . శివ ద‌ర్శ‌కుడిగా జయ పేరు నిలబెట్టాలి. . రూపేష్ వెల్ కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. బయట ఎన్నో సక్సెస్ ఫుల్ బిజినెస్ లు ఉన్నా సినిమా అంటే ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్  చూశాను. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్" అన్నారు.

శివ ద‌ర్శ‌కుడిగా త‌ప్ప‌క స‌క్సెస్ అవుతాడు

సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ - శివ ద‌ర్శ‌కుడు కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఫ‌స్ట్ కాపీ కూడా వారం రోజుల్లో రెడీ అవుతుంద‌ని చెప్పాడు.  ఒక అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా నా వ‌ద్ద‌కు వ‌చ్చి ఓ సినిమా ప్రొస్ట్ ప్రొడ‌క్ష‌న్ అంతా హ్యాండిల్ చేశాడు. రాజుగారు ఎలా ఒక సినిమా స‌క్సెస్ అవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకొని క‌ష్ట‌ప‌డి  ప్ర‌మోష‌న్ చేస్తారో... అలా శివ కూడా చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ద‌ర్శ‌కుడుగా స‌క్సెస్ కావ‌డానికి ఈ సినిమాతో ఒక మంచి ప్ర‌య‌త్నం చేశాడు.  టీమ్ అంద‌రికీ ఆల్‌దిబెస్ట్‌ అన్నారు. 

ప్ర‌ముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ - ``నాగార్జునగారు, పూరీ జ‌గ‌న్నాథ్‌గారు, మారుతిలాంటి ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులు ఈ సినిమాకు ముందుకొచ్చి శివ‌మీద వారికి ఉన్న‌ప్రేమ‌ను, న‌మ్మ‌కాన్ని తెలియ‌జేస్తుంటే శివ చాలా అదృష్ట‌వంతుడ‌నిపిస్తోంది. ఇంత‌మంది పెద్ద‌ల అశీస్సుల‌తో శివ‌కు, రూపేష్ గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాల‌ని, ఎంటైర్ యూనిట్‌కి ఈ ఇదొక  పెద్ద సినిమా అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు శివకుమార్‌ బి.మాట్లాడుతూ - ``నాగార్జున టీజ‌ర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రొత్స‌హించే నాగార్జున‌గారి చేతుల మీదుగా మా టీజ‌ర్ లాంచ్ కావ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ 22టీమ్ త‌రఫున  థ్యాంక్స్‌. మారుతి ఇటీవ‌ల ప్ర‌తిరోజూపండ‌గే సినిమాతో పెద్ద స‌క్సెస్ అందుకున్నారు. ఆ పండ‌గ‌ను ఈ పండ‌గ‌కి తీసుకువ‌చ్చారు. మా 22లో ఆ పండ‌గ జ‌రుగుతుంది. ఈ సినిమాకు ప‌ని చేసిన సాంకేతిక నిపుణులు అంద‌రికీ థ్యాంక్స్‌. నాకు స‌పోర్ట్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.