cloudfront

Advertisement


Home > Movies - Press Releases

తొలి త్రీడీ హర్రర్ సినిమా

తొలి త్రీడీ హర్రర్ సినిమా

భయం అన్నది ఒక్య యాంగిల్ లో చూస్తేనే బాగా భయపెట్టేస్తుంది. అలాంటిది అన్ని డైమన్షన్లలో కనిపిస్తే.. ఇంకా భయమే కదా? ఆ ప్రయత్నమే చేస్తున్నారు లీసా సినిమా నిర్మాతలు. అంజలి నటించిన ఈ హర్రర్ సినిమాను త్రీడీ టెక్నాలజీలో అందిస్తున్నారు. హర్రర్ జోనర్ సినిమాను త్రీడీ టెక్నాలజీలో అందించడం ఇదే తొలిసారి.

వీరేష్ కాసాని  సమర్పిస్తున్న ఈ  చిత్రాన్ని  ఎస్.కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు.  చిత్ర సమర్పకులు కాసాని వీరేశ్ మాట్లాడుతూ'' అంజలి ఇంతకు ముందు ఎన్నో మంచి చిత్రాలు చేసారు, ఇప్పుడు లీసా సినిమా మరో మంచి చిత్రంగా మిగిలిపోతుంది, గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు విభిన్నంగా ఈ సినిమా ఉంటుంది'' అన్నారు . 

చిత్ర నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ''గతంలో అంజలితో షాపింగ్ మాల్ జర్నీ లాంటి హిట్ సినిమాలు తమ సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించడం జరిగింది.   ఆ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు ఈ లీసా త్రీడి సినిమాని కూడా ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. డిజిటల్ రూపంలో  త్రీడీలో  విడుదలవుతున్న మొట్టమొదటి హారర్ చిత్రమిది.  వేసవి కానుకగా మే 24న  ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు. 

"లీసా' త్రీడీ  చిత్ర దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ 100 రోజులు పైగా ఈ షూటింగ్ జరిగింది, సాంకేతిక నిపుణుల సహకారంతో, నటీనటుల సహకారంతో సులువుగా సినిమాను రూపొందించగలిగానని అన్నారు. బహ్మానందంతో సహా ఎంతో మంది తెలుగు నటులు సినిమాలో పాలు పంచుకున్నారని ఆయన తెలిపారు. అతి త్వరలో ఆడియో, ట్రైలర్ లను విడుదల చేసి సినిమాను కూడా ఈ నెల 24న  విడుదల చేస్తామని అన్నారు.

హీరోయిన్ అంజలి మాట్లాడుతూ... మొదటి సారిగా 3డి చిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడు రాజు లాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు.  ముత్తయ్య తన కెమెరాతో మరింత అందంగా నన్ను చూపించారు, ధన్యవాదాలు అని అన్నారు.