cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ టీజ‌ర్..4 ల‌క్ష‌ల లైకులు!

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ టీజ‌ర్..4 ల‌క్ష‌ల లైకులు!

ఒక‌వైపు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ టీజ‌ర్ విష‌యంలో మిశ్ర‌మ‌మైన టాక్ వ‌స్తూ ఉంది. ఈ టీజ‌ర్ ను చూస్తుంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇది వ‌ర‌క‌టి సినిమాలు గుర్తుకు వ‌స్తున్నాయ‌నే అభిప్రాయాలు గ‌ట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే.. నెటిజ‌న్ల‌ను మాత్రం ఈ సినిమా టీజ‌ర్ ఆక‌ట్టుకుంటూ ఉంది. ఆస‌క్తిదాయ‌క‌మైన రీతిలో వ్యూస్ ను, లైక్స్ ను పొందుతూ ఉంది ఈ సినిమా టీజ‌ర్.

ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ వ్యూస్ ఏడు మిలియ‌న్ల కౌంట్ ను దాటాయి. డెబ్బై ల‌క్ష‌ల వ్యూస్ ను దాట‌డంతో..దాదాపు మూడు ల‌క్ష‌ల లైక్స్ ను పొంది, నాలుగు ల‌క్ష‌ల లైక్స్ దిశ‌గా సాగుతూ ఉంది. ద్వితీయ శ్రేణి హీరోల సినిమాల విష‌యంలో ఇది రికార్డే అని ఈ సినిమా రూప‌క‌ర్త‌లు చెబుతున్నారు.

అర్జున్ రెడ్డి, డియ‌ర్ కామ్రేడ్ సినిమాల‌ను గుర్తు చేస్తున్నా.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ దీనిపై ఆస‌క్తిని నిలుపుతున్న‌ట్టుగా ఉంది. విడుద‌ల అయితే కానీ.. ఈ సినిమా అస‌లు ఛాయ‌లేమిటో అర్థం అయ్యేలా లేవు. వేలంటైన్స్ డే  సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.