cloudfront

Advertisement


Home > Politics - Gossip

అలీ బేరాలు: అది బుజ్జగింపా? బెదిరింపా..?

అలీ బేరాలు: అది బుజ్జగింపా? బెదిరింపా..?

తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే.. సినిమా వాళ్లకిది అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న సినీ నటుడు అలీ కూడా  ఇప్పుడు ఇదే సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. స్నేహితుడు పవన్ కల్యాణ్ తో కలసి ఉండాలా.. జనం ఎదురు చూస్తున్న జగన్ వెంట నడవాలా లేక అధికారంలో ఉన్న టీడీపీలో చేరాలా అని ఆలోచిస్తున్నాడు.

నిన్నటివరకూ అలీ వైసీపీలో చేరడం ఖాయంగానే కనిపించింది. డిసెంబర్ 28న విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ తో భేటీ అయిన అలీ వైసీపీలో చేరేందుకు సుముఖత చూపించాడు. జనవరి 9న మహూర్తం కూడా కుదిరినట్టు వార్తలొచ్చాయి. అయితే అలీ సడన్ గా ఈరోజు చంద్రబాబుని, పవన కల్యాణ్ ని వెంటవెంటనే కలవడం చర్చకు దారితీసింది.

అమరావతిలో చంద్రబాబుని కలసిన అలీ దాదాపు అరగంట సేపు ఏకాంతంగా సమాలోచనలు జరిపాడు. ఆ తర్వాత అట్నుంచి అటే జనసేనాని ఇంటికెళ్లి ఆయనతో భేటీ అయ్యాడు. జనసేన నేత ముత్తంశెట్టి కృష్ణారావుతో కలసి అలీ పవన్ కల్యాణ్ ని కలిశాడు.

అసలు వైసీపీలో చేరాలనుకుంటున్న అలీ చంద్రబాబు, పవన్ తో ఎందుకు సమాలోచనలు జరిపాడు? ఏ పార్టీలో ఉన్నా అందరి సహకారం కావాలని అర్థించడానికి వెళ్లాడా? లేక వీళ్లైమైనా హామీలిస్తారని కలిశాడా? ప్రస్తుతానికైతే ఇది సస్పెన్స్.

ఇదంతా పక్కనపెడితే, ప్రాణ స్నేహితులుగా ఉండే పవన్, అలీ మధ్య వ్యవహారం ఎందుకు చెడిందనేదే ఇప్పుడు హాట్ టాపిక్. జనసేనలో టికెట్ కావాలంటే అలీకి ఎవరి రికమండేషన్ అక్కర్లేదు. ఏ సీట్ కావాలంటే ఆ సీట్ అడిగి తీసుకునే చొరవ పవన్ దగ్గర అలీకి ఉంది.

జనసేన కార్యాలయం ప్రారంభోత్సవానికి అలీ వెళ్లడంతో జనసేన తరపునే ఆయన పోటీ చేస్తాడనే వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత అలీ చూపు వైసీపీపై పడింది. రాష్ట్రమంతా వైసీపీ పవనాలు వీస్తున్నాయని తేలడంతోనే అలీ జగన్ తో కలసి వెళ్లాలనుకున్నాడు.

తీరా ఇప్పుడు చంద్రబాబు, పవన్ తో ఎందుకు కలిశాడనేదే తేలాల్సి ఉంది. పవన్ అలీని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నాడని జనసేన వర్గాలంటున్నాయి. మరి చంద్రబాబుతో భేటీలో ఏం జరిగిందో అలీకే తెలియాలి. మొత్తానికి జనవరి 9న వైసీపీలో అలీ చేరికపై ఈ భేటీలు ఏమైనా ప్రభావం చూపిస్తాయో లేదో మరో మూడు రోజుల్లో తెలుస్తుంది. 

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

మహిళా మంత్రికి సలహాలు.. పోటీ చేయకమ్మా డబ్బులు మిగులుతాయ్