cloudfront

Advertisement


Home > Politics - Gossip

అవంతి గెలిచేశారా..!

అవంతి గెలిచేశారా..!

విశాఖజిల్లా భీమిలీ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా టీడీపీ హైకమాండ్ కి కొరుకుడు పడని సీటుగా మారింది. తొలివిడత జాబితాలో భీమిలీ లేకపోవడం గమనార్హం. నిజానికి టీడీపీకి కంచుకోటలాంటి భీమిలీ ఎపుడు మొదటి లిస్ట్ లోనే ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు భీమిలీ నుంచి కాకుండా విశాఖ ఉత్తరం నుంచి పోటీచేస్తున్నారు. దాంతో అవంతి శ్రీనివాసరావు, గంటాల మధ్య రసవత్తరమైన పోరు ఉంటుందని భావించిన వారికి నిరాశే మిగిలింది. రెండువేల కోట్లతో నియోజకవర్గం అభివ్రుధ్ధి చేశానని, తానే మళ్ళీ పోటీచేస్తానని చెప్పుకున్న గంటా ఇపుడు మరో సీటు చూసుకుని పలాయనం చిత్తగించారు.

దాన్నిబట్టి చూస్తే భీమిలీలో అవంతి శ్రీనివాసరావు ముందు  నిలిచి గెలవలేమన్న కలవరంతోనే గంటా సీటు మార్చేశారని ప్రచారం సాగుతోంది. ఇక నిన్నటికి నిన్న ఏకంగా సీఎం తనయుడు నారాలోకేష్ భీమిలీలో పోటీ చేస్తానంటు తొడగొట్టారు. తీరాచూస్తే ఆయన కూడా విశాఖ ఉత్తరం అంటూ హడావుడి చేసినా చివరికి విశాఖ నుంచే తప్పుకున్నారు. ఈ మధ్యలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు కూడా వినిపించింది కానీ ఆయన వెంటనే తూచ్ అనేశారు ఇలా ఎవరూ కూడా భీమిలీలో పోటీకి ముందుకు రాకపోవడంతో ఎవరిని పోటీకిపెట్టి అవంతిని ఢీకొట్టాలో తెలియక టీడీపీ పెద్దలు తలపట్టుకున్నారు.

లేటేస్ట్ గా భీమిలీ నుంచి పోటీకి పూసపాటి వారి వారసురాలు, అశోక్ గజపతిరాజు కుమార్తె అయిన అతిది గజపతిరాజుని పెట్టాలను కుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ నుండి 1962, 1967 ఎన్నికల్లో రెండుమార్లు పీవీజీ రాజు పోటీచేసి గెలిచారు. ఇక టీడీపీ పెట్టిన కొత్తల్లో ఆనందగజపతిరాజు భీమిలీ నుంచి పోటీచేసి విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఆ ముందూ తరువాత కూడా అనేకమంది రాజులు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దాంతో భీమిలీకి రాజుల కోట అన్న పేరు కూడా ఉంది. మధ్యలో కాపులు వచ్చి భీమిలీని తమ పరం చేసుకున్నారన్న ఆవేదన రాజుల్లో ఉంది. దాంతో ఈసారి అతిదికి భీమిలీ సీటు ఇస్తే గెలిపించుకుంటామని రాజులు అంటున్నారట.

అలాగే, భీమిలీలో కాపులతో పాటు యాదవ సామాజిక వర్గం బలంగా  ఉంది. దాంతో గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ని తెస్తారంటున్నారు. ఇక గీతం విద్యాసంస్థలు భీమిలీలో ఉన్నాయి. అవంతి కూడా విద్యాసంస్థల అధినేత కాబట్టి ఆయన్ని ఢీకొట్టడానికి ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ ని కూడా దింపుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా అవంతి ముందు వీరు సరిపోతారా అన్న డౌట్ కూడా టీడీపీ పెద్దలను వెంటాడుతోంది. మొత్తానికి ఒక్క అవంతి కోసం ఎన్నో పేర్లు ముందుకు వస్తున్నాయంటే అసలు ఎన్నికల కంటే ముందే అవంతి గెలిచేశారని వైసీపీనేతలు అంటున్నారు.