cloudfront

Advertisement


Home > Politics - Gossip

తెలంగాణ ఎన్నికల బరిలో బాలయ్య

తెలంగాణ ఎన్నికల బరిలో బాలయ్య

తెలంగాణ ఎన్నికల్ని టీడీపీ లైట్ తీసుకుందని అంతా అనుకున్నారు. కాంగ్రెస్ తో అక్రమ సంబంధం పెట్టుకొని, మహాకూటమిలో కలిసినప్పుడే టీడీపీ పనైపోయిందని అంతా లెక్కకట్టారు. ఆ అంచనాలకు తగ్గట్టే, కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి, ఎలాంటి డిమాండ్ చేయకుండా ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకున్నారు టీడీపీ నేతలు.

అయితే మరీ పేలవంగా ఎన్నికల్లో పోటీచేయడం ఎందుకనే ఉద్దేశంతో ఇప్పుడు తన "తురుపుముక్క"ను రంగంలోకి దించుతున్నారు చంద్రబాబు. తను తెలంగాణలో అడుగుపెట్టకుండా, బాలయ్యను ప్రచారానికి పంపిస్తున్నారు.

ఈ మేరకు బాలయ్య ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 25 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ప్రచారం చేస్తాడు బాలయ్య. అంటే.. తెలంగాణలో టీడీపీ స్టార్ కాంపైనర్ ఇతడే అన్నమాట.

తెలంగాణ టీడీపీపై ఎప్పుడో ఆశలు వదులుకున్నారు చంద్రబాబు. ఓటుకు నోటు కేసు బయటకొచ్చినప్పుడే ఈ విషయం తేలింది. అంతోఇంతో కీలక నేతలంతా కారెక్కడంతో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో మహాకూటమి అనేది పుట్టుకురావడం బాబుకు బ్రహ్మాండంగా కలిసొచ్చింది.

అందుకే గుంపులో గోవిందయ్యలా వెళ్లి కలిసిపోయారు. మహాకూటమి ముసుగులో కాంగ్రెస్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికిప్పుడు తన అభ్యర్థుల కోసం తెలంగాణ వెళ్లి, ప్రచారంలో భాగంగా కేసీఆర్ పై విమర్శలు చేసేంత దమ్ము చంద్రబాబుకు లేదు. అలా చేస్తే కేసీఆర్ పరిథిలో ఉన్న ఓటుకు నోటు కేసును మళ్లీ తిరగదోడతారని భయం.

అందుకే తను తెలివిగా తప్పుకొని, బాలయ్యను ముందుకు నెట్టారు. అంటే.. కేసీఆర్ పై చంద్రబాబు చేయాలనుకున్న విమర్శల్ని, ఇకపై బాలయ్య నోటి నుంచి వినాలన్నమాట. 

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? ...చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్