cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఏపీలో ఉనికి కోసం బీజేపీ చీప్ ట్రిక్స్

ఏపీలో ఉనికి కోసం బీజేపీ చీప్ ట్రిక్స్

ప్రత్యేకహోదా అంశంతో ఏపీలో శవాసనం వేసిన బీజేపీ, ఎమ్మెల్యేలను కూడా ఒక్కొక్కరినే కోల్పోతోంది. ఇలాంటి టైమ్ లో తమ ఉనికిని చాటుకోవాలంటే ఏం చేయాలి? అక్కడే కమలదళం మాస్టర్ ప్లాన్ వేసింది. ఉత్తరాదిన ఎలాంటి ఎత్తులు వేసి మెజార్టీ వర్గాలకు ఏవిధంగా చేరువైందో.. దక్షిణాదిన కూడా అదే ప్లాన్ అమలు చేస్తోంది. క్రమక్రమంగా మత కల్లోలాలను రెచ్చగొట్టడానికి సిద్ధపడుతోంది.

శబరిమల అంశాన్ని తెరపైకి తెచ్చి ఏపీలో కూడా ఆందోళనలకు దిగిన బీజేపీ.. తాజాగా మైనార్టీలను రెచ్చగొట్టేలా బహిరంగ వ్యాఖ్యలకు దిగింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న నెల్లూరులో హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరులో నిషేధిత ఉగ్రవాద సంస్థలున్నాయని, తీవ్రవాదులకు నెల్లూరు షెల్టర్ జోన్ గా మారిందన్నారు. బీజేపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని కూడా రెచ్చగొట్టారు. ఇది ఒక నగరానికో, ఒక జిల్లాకో పరిమితం కావడంలేదు. ప్రతి జిల్లాలోనూ బీజేపీ చోటామోటా నేతలు ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.

రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించడానికి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. మత కల్లోలాలతో పాటు, ఘర్షణలకూ సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడి కాన్వాయ్ ని అడ్డుకోవడం, ఆ తర్వాత జరిగిన రభస ఇందులో భాగమే. కేవలం టీడీపీపై ఉన్న కక్షతో ప్రశాంతంగా ఉన్న ఏపీని అల్లకల్లోలం చేయడానికి కూడా వెనకాడ్డం లేదు బీజేపీ.

ఏపీ ప్రజలు, ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలు ఎవ్వరూ తమను లెక్కచేయకపోవడంతో చివరాఖరికి ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. మతకల్లోలాలు రాజేసి చలిమంట కాచుకోవాలనుకుంటోంది. 

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!