cloudfront

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు కర్నాటకం.. కేసీఆర్‌కేంటి నష్టం.!

చంద్రబాబు కర్నాటకం.. కేసీఆర్‌కేంటి నష్టం.!

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని సొంతంగా ఎదుర్కోలేక, కాంగ్రెస్‌ పంచన చేరింది తెలుగుదేశం పార్టీ. 'మేం గెలవడం ముఖ్యంకాదు.. కేసీఆర్‌ ఓటమి మాకు అవసరం..' అంటోంది తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ పంచన చేరి, ఆ పార్టీ దయతలచినన్ని సీట్లతో సరిపెట్టుకుంటోన్న తెలుగుదేశం పార్టీ.. 'కర్నాటక' వేదికగా చెత్త రాజకీయానికి తెరలేపింది.

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. కర్నాటక ఎన్నికల తర్వాత, కుమారస్వామి తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు, తెలంగాణలో ఆయనకు ఆశ్రయం లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అప్పట్లో కుమారస్వామికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. ఇది అందరికీ తెల్సిన విషయమే.

కర్నాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కకపోవడం తమ ఘనతేనని చంద్రబాబు చెప్పుకున్నారు కూడా. ఆ తర్వాత కాంగ్రెస్‌ - జేడీఎస్‌ కూటమి అధికారంలోకి రాగానే, అక్కడికేదో తామే ఆ కూటమిని సెట్‌ చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్న సంగతి తెల్సిందే.

బెంగళూరుకి వెళ్ళి రాహుల్‌గాంధీతో చంద్రబాబు కులాసా కబర్లు చెప్పిన వైనం ఎలా మర్చిపోగలం.? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు బెంగళూరు వేదికగా రాజకీయం షురూ చేశారు. కేంద్రంలో, బీజేపీయేతర రాజకీయ పార్టీల్ని ఒక్కటి చేసే క్రమంలోనే జేడీఎస్‌ పెద్దలతో చంద్రబాబు మంతనాలు జరుపుతారట. పైకి చెప్పేమాట ఇదే అయినా, తెరవెనుకాల వ్యవహారం ఇంకోలా వుంది.

జేడీఎస్‌ మద్దతుదారులైన కన్నడిగుల ఓట్లు, తెలంగాణ ఎన్నికల్లో తమకే పడేలా చంద్రబాబు, జేడీఎస్‌ పెద్దలతో మంతనాలు జరిపేందుకే ఢిల్లీకి పయనమయ్యారు. మరి, జేడీఎస్‌ - కేసీఆర్‌తో స్నేహం కాదనుకుని, చంద్రబాబుకి మద్దతిచ్చేలా వ్యవహరిస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే.

ఒక్కటి మాత్రం నిజం.. చంద్రబాబు ఇటీవలి కాలంలో, పూర్తిస్థాయి అభద్రతాభావంతో వున్నారు. హైద్రాబాద్‌ తన కష్టార్జితమేనంటున్నారు.. కర్నాటకలో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ గెలుపు తన గొప్పతనమేనంటున్నారు.. అభద్రతాభావం కారణంగా పుట్టుకొచ్చిన అసహనం చంద్రబాబుతో ఇలాంటి అర్థం పర్థంలేని మాటలు మాట్లాడిస్తోందన్నమాట.

ఒక్కటి మాత్రం నిజం.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పోటీపడేంత సీన్‌ చంద్రబాబుకి లేదు. కాంగ్రెస్‌ పార్టీదీ దాదాపు ఇదే పరిస్థితి. మెజార్టీ సీట్లకు కాస్త దూరంలో టీఆర్‌ఎస్‌ ఆగిపోతే, రాజకీయంగా చక్రం తిప్పొచ్చన్నది మహాకూటమిలోని పార్టీల వాదన. ఆ పరిస్థితే వస్తే, ఎవర్ని ఎలా 'తోమెయ్యాలో' కేసీఆర్‌ కన్నా బాగా ఇంకెవరికి తెలుసు.?  

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్