cloudfront

Advertisement


Home > Politics - Gossip

కాంగ్రెస్, టీడీపీల సీట్ల డీల్ కుదిరినట్టే!

కాంగ్రెస్, టీడీపీల సీట్ల డీల్ కుదిరినట్టే!

చంద్రబాబు నాయుడి తాజా ఢిల్లీ పర్యటనతో కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఏపీలో కూడా ఓకే అయినట్టుగా తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ తో కలిసి పోటీచేయడమా, కాంగ్రెస్ ను పక్కనపెట్టి పోటీ చేయడమా.. అనే అంశంపై చంద్రబాబు నాయుడి కసరత్తు పూర్తి అయ్యిందని, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడానికే చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

ఆ విషయాన్ని ఖరారు చేస్తూ.. రాహుల్ గాంధీని కలిసి.. తన రొటీన్ గా శాలువా వేసి.. సన్మానించినట్టుగా తెలుస్తోంది. ఎవరైనా మనింటికి వస్తే వాళ్లకు శాలువా సత్కారం చేయడం సంప్రదాయం. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం వేరే వాళ్లింటికి వెళ్లి వాళ్లుశాలువాలు వేస్తూ ఉంటాడు.

గతంలో బీజేపీ వాళ్లకు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లకు. అదే తేడా. ఆ సంగతలా ఉంటే.. ఏపీ వరకూ కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీచేయడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఇటీవలే ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీడీపీతో పొత్తు అవసరమే అంటూ.. ఏయే స్థానాలు కావాలో కూడా ఒక నివేదికను రాహుల్ గాంధీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఆ నివేదిక రాహుల్ ద్వారా చంద్రబాబుకు చేరినట్టుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ పాతిక ఎమ్మెల్యే సీట్లు, ఐదు ఎంపీ సీట్లను కోరుతున్నట్టుగా సమాచారం. వీటిలో కొన్నింటికి చంద్రబాబు నో చెప్పినా.. తెలంగాణలో టీడీపీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లకు రెట్టింపు స్థాయిలో అయితే ఏపీలో కాంగ్రెస్ కు టీడీపీ టికెట్లను కేటాయించాల్సిన డీల్ అయితే ఒకటి ఉందని తెలుస్తోంది.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!