cloudfront

Advertisement


Home > Politics - Gossip

జగన్ ఇలా చేస్తే మళ్లీ ‘అప్పర్ హేండే’!

జగన్ ఇలా చేస్తే మళ్లీ ‘అప్పర్ హేండే’!

రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఒకటే పనిచేస్తున్నప్పుడు.. ‘అప్పర్ హేండ్’  అనే మాట ఉండదు. అలాంటి మాట గురించిన ఆలోచన కూడా చాలా సంకుచితమైనదే అవుతుంది. ప్రపోజల్ పెట్టింది పవన్ కల్యాణ్.. దానిని అంగీకరించి.. ‘‘అవిశ్వాసం మేమైనా పెడతాం.. వెంటరావడానికి తెదేపాను ఒప్పించాలి.. తెదేపా పెట్టినా మేం వెంట నడుస్తాం’’ అని జగన్ అంటే.. ఆయనేదో అప్పర్ హేండ్ కోసం తపన పడుతున్నాడని చంద్రబాబు విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఆ లెక్కన చూస్తే ‘ముందు నువ్వు అవిశ్వాసం పెట్టు..  మద్దతు పూచీ నాది’ అంటూ పవన్ మళ్లీ అప్పర్ హేండ్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ జగన్ అప్పర్ హేండ్ తీసుకోవడానికి ఒక అవకాశం మిగిలి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది అంతిమ పోరాటం గనుక.. ఎవరు పోరాటానికి పూనుకున్నా సరే.. ప్రత్యేక హోదా అనేది విధిగా ఎజెండా అంశంగా ఉండాలని ఆయన కూడా ఒక కండిషన్ పెట్టాలి. ప్రత్యేకహోదా ద్వారా మాత్రమే రాష్ట్రానికి అపరిమితమైన మేలు జరుగుతుందనేది అందరూ ఎరిగిన సంగతి. తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా దాన్ని ఎందుకూ కొరగాకుండా తొక్కేసిందని కూడా అందరికీ తెలుసు. చంద్రబాబు ఏదో తనతో చెప్పారని అంతకుముందు తిరుపతి, కాకినాడల్లో ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ రంకెలు వేసిన పవన్ కల్యాణ్ కూడా.. ఆ విషయంలో తర్వాత సైలెంట్ అయిపోయారు. మొత్తానికి అందరూ కలిసి ఆ డిమాండును పడుకోబెట్టేశారు.

ఇలాంటి నేపథ్యంలోనే జగన్ మళ్లీ దానికి జీవం పోయాల్సిన అవసరం ఉంది. పవన్ ను కూడా స్పష్టంగా ప్రత్యేకహోదా డిమాండునే స్వీకరించమని జగన్ నిర్దేశించాలి. చంద్రబాబునాయుడు ప్యాకేజీకి ఒప్పుకుని.. దానిద్వారా స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేయడం మొదలైన దగ్గరినుంచి పవన్ కల్యాణ్ కూడా హోదా డిమాండును పక్కన పడేశారు. నిజానికి పవన్ లాగా.. రాష్ట్రం తప్ప నాకు మరేం అక్కర్లేదు అని ప్రవచనాలు చెప్పే వ్యక్తి.. ఇలా రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకమైన డిమాండ్ ను చంద్రబాబు చెప్పిన మాటలు విని పక్కన పారేయడం అనుచితం మాత్రమే కాదు.. రాష్ట్రప్రయోజనాలకు ద్రోహం కూడా.

అయితే.. అసలు చంద్రబాబు ఏం చెప్పారో.. ఆయన ఏం చెప్పబట్టి.. హోదా కంటె ప్యాకేజీ బెటర్ అని పవన్ నమ్మారో ఆయన జాతికి వివరించాల్సిన అవసరం ఉంది. అసలు హోదాలోని లాభాలేంటి.. వాటికి ప్యాకేజీలో ఉన్న సమాన ప్రత్యామ్నాయమేంటి చెప్పలేకపోతే.. ‘‘ప్యాకేజీ వద్దు- హోదానే ముద్దు’’ డిమాండును పవన్ కల్యాణ్ తీసుకోవాలని కండిషన్ పెడితే.. కాస్త రాష్ట్రానికి మేలు జరుగుతుంది.