cloudfront

Advertisement


Home > Politics - Gossip

'జ్యోతి' రగిలిస్తున్న అనుమానాలు

'జ్యోతి' రగిలిస్తున్న అనుమానాలు

తెలుగునాట మీడియా పార్టీల పరంగా చీలిపోయింది. మేనేజ్ మెంట్లు కాదనవచ్చు. ఎడిటర్లు లేదనవచ్చు. కానీ నిత్యం చదివే జనాలకు తెలుసు ఏ పత్రిక ఎటు మొగ్గుతుందో. అయితే ఆంధ్రజ్యోతి పత్రికకు ఇంకో ఎగస్ట్రా క్వాలిఫికేషన్ వుంది. దాదాపు తెలుగుదేశం మనోభీష్టం, మనసులో అభిప్రాయాలు అందులో ముందుగానే ప్రతిఫలిస్తుంటాయి. ఆంధ్రజ్యోతి ఆర్కే ఈ ఆదివారం తన కాలమ్ లో రాసిన ఓ పేరాగ్రాఫ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో డిస్కషన్ పాయింట్ గా మారింది. ఆ పేరా గ్రాఫ్ ఇలా వుంది...

''......జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటుచేసిన జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ రెండు రోజుల సమావేశం ముగిసింది. నిజానికి ఎవరి లెక్కలు నిజం, ఎవరి వాదనలో పస ఉందో తేల్చడం ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే! రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏమేం రావాలి? ఎప్పటిలోగా ఇస్తారు? అన్నది మాత్రమే!...''

''... రాష్ర్టానికి కేంద్రం న్యాయం చేసిందని పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని కమిటీ చెప్పగలదా? లేక కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని చెబుతారా? ఆంధ్రప్రదేశ్‌కు ఏదో చేయాలన్న తపనతో పవన్‌ కల్యాణ్‌ ఏదో చేస్తున్నారు. ఈ కమిటీ పాత్రపై అవగాహన ఉన్నందునే కాబోలు జయప్రకాశ్‌నారాయణ్‌ మాట్లాడుతూ, తమపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంచేశారు. మొత్తంమీద పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటుచేసిన కమిటీ వల్ల ఖాళీగా ఉన్న కొంతమందికి చేతి నిండా, నోటి నిండా పని లభించింది...''

''... హైదరాబాద్‌ను వదలకుండా ఇక్కడే నివసిస్తూ ఏపీలో రాజకీయాలు చేయాలనుకునే వారి వల్ల ఆ రాష్ర్టానికి లాభమా? నష్టమా? అన్నది ప్రజలే ఆలోచించుకోవాలి. ప్రత్యేకమైన సమస్యపై అధ్యయనం చేసే కమిటీకి లోగో ఎందుకో అర్థంకాని పరిస్థితి. నిజ నిర్ధారణ కమిటీకి లోగో ఆవిష్కరించడం ఇప్పుడే చూస్తున్నాం. అయినా పవన్‌ కల్యాణ్‌ వంటివారిని అర్థం చేసుకోవడం కష్టం! అన్నట్టు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు ఈ మధ్య పవన్‌ కల్యాణ్‌పై కొత్త ప్రేమ పుట్టుకొచ్చిందనీ, అందులో భాగంగానే ఆయన పవన్‌ కల్యాణ్‌ను ఇటీవల రెండు మూడు పర్యాయాలు కలిశారనీ బలంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాల్సిందిగా గవర్నర్‌ నరసింహనే పవన్‌ కల్యాణ్‌కు సూచించారని కూడా చెబుతున్నారు. నరసింహన్‌–పవన్‌ కల్యాణ్‌ సమావేశాలు నిజమైతే అందులోని చిదంబర రహస్యం ఏమిటో వెల్లడి కావలసి ఉంటుంది!...''

అంటే పవన్ కళ్యాణ్ కమిటీ నిర్ణయం వెలువడానికి ముందే పవన్ పై తెలుగుదేశం ఫైల్ రెడీ అయిపోతోందన్న మాట. కేసిఆర్ ను కలిసారని, గవర్నర్ ను కలిసారని, హైదరాబాద్ లో వుంటూ ఆంధ్రలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలకు పాయింట్లు రెడీ అయిపోయాయి.

అంటే పవన్ ను పూర్తిగా తెలుగుదేశం పార్టీ నమ్మకంలోకి తీసుకోలేదని క్లియర్ అవుతోంది. ఇప్పుడు చిన్నగా సన్నాయి నొక్కులు స్టార్ట్ చేయడం ద్వారా పవన్ కు 'స్వీట్ వార్నింగ్' లు ఇచ్చే ప్రయత్నం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే పోరాట కమిటీని నిజనిర్థారణ కమిటీగా మార్చడం ద్వారా పవన్ ఓ తప్పటడడుగు వేసారు. ఆపైన రాష్ట్రం ఖర్చులపై కాకుండా, కేంధ్రం నిధులపైన మాత్రమే నిజాలు వెలికి తీయడం ద్వారా మరో తప్పటడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక చర్చలు, మీటింగ్ లు అంటూ సమస్యను నీరుగారిస్తే పవన్ పూర్తిగా కిందికి జారిపోతారు. 

ఇన్నాళ్లు ఏదో కాలయాపన రాజకీయాలు చేస్తూ వచ్చిన, ఈ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, అందులోకి తీసుకున్న జనాలతో కాస్త వైవిధ్యమైన పాలిటిక్స్ చేస్తున్న అభిప్రాయాన్ని ఇప్పుడిప్పుడే జనంలో కలిగించే ప్రయత్నం కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆయన తెలుగుదేశం స్మూత్ గా ఈ విధంగా ఇస్తున్న 'స్వీట్ వార్నింగ్' లకు తలొగ్గారా? మళ్లీ జనసేన పరిస్థితి మరో ప్రజారాజ్యమే.