cloudfront

Advertisement


Home > Politics - Gossip

మోడీ 'కోటా': ఎవరికి నష్టం? ఎవరికి కష్టం?

మోడీ 'కోటా': ఎవరికి నష్టం? ఎవరికి కష్టం?

ఒక్కరంటే ఒక్కరు కూడా, ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్‌పై కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోయారు లోక్‌సభలో. 'ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి..' అన్నట్టే వుంది విపక్షాల వైఖరి. వున్నంతలో, మజ్లిస్‌ పార్టీ తరఫున అసదుద్దీన్‌ ఒవైసీ మాత్రమే కాస్త గట్టిగా కేంద్రాన్ని నిలదీశారేమో. అయితే, ఆయనా పూర్తిస్థాయిలో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితి. ఎందుకంటే, ఈబీసీల్లోకి రిజర్వేషన్లు లేని అన్ని సామాజిక వర్గాలూ, మతాలు, కులాలకతీతంగా పేదలూ చేరతారు కాబట్టి.

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సైతం, మోడీ 'కోటా'ని స్వాగతించారు, అఫ్‌కోర్స్‌ ఆ తర్వాత మోడీపై విమర్శలు చేశారనుకోండి.. అది వేరే విషయం. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు, కేంద్రాన్ని గట్టిగా నిలదీయాల్సిన సందర్భమిది. 2014 ఎన్నికల్లో ఇటు టీఆర్‌ఎస్‌, అటు టీడీపీ.. రిజర్వేషన్లపై తమ తమ రాష్ట్రాల్లోని ప్రజలకు చాలా హామీలు ఇచ్చాయి, వాటిని ఆ తర్వాత తుంగలో తొక్కాయి కూడా.

అసెంబ్లీలో తీర్మానాలు చేసేస్తే, కేంద్రం ఒప్పేసుకుంటుందా.? ఆ విషయం తెలిసీ, రిజర్వేషన్లపై ఎలా హామీలు ఇచ్చేశారట.? ఈ ప్రశ్నకు ఇటు టీఆర్‌ఎస్‌ కావొచ్చు, అటు టీడీపీ కావొచ్చు.. స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. తమ డిమాండ్లను, తెలుగు రాష్ట్రాల తీర్మానాల్ని లెక్క చేయకుండా కేంద్రం ఒకే ఒక్కరోజులో 10శాతం రిజర్వేషన్లను ఈబీసీల కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడమంటే, అసలు మోడీ దృష్టిలో, దేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వున్నాయా.? లేదా.? అన్న అనుమానం కలగడం సహజమే.

ఎవరేమనుకున్నా, నరేంద్రమోడీ ఖచ్చితమైన రాజకీయ వ్యూహాలతో వున్నారు సార్వత్రిక ఎన్నికల కోసం. ఇందులో భాగంగానే దేశంలో ఏ రాజకీయ పార్టీ సైతం తమను ప్రశ్నించడానికి వీల్లేకుండా అత్యంత వ్యూహాత్మకంగా ఈబీసీ బిల్లుని మోడీ సర్కార్‌ తెరపైకి తెచ్చింది. ఈబీసీ బిల్లుతో, ఓపెన్‌ కోటాకి 10శాతం చిల్లుపడినా, దాన్ని ఎవరూ గట్టిగా ప్రస్తావించలేని దుస్థితి. అయితే, ఈ మంత్రం మోడీ సర్కార్‌కి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంతవరకు లాభం చేకూర్చుతుంది.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

ఒక్కటి మాత్రం నిజం, విపక్షాలు ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నాయి. గట్టిగా మాట్లాడితే, తమ ఓటు బ్యాంకుకి చిల్లుపడ్తుందన్న భయం అన్ని రాజకీయ పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. సో, ప్రస్తుతానికి నష్టమైనా, కష్టమైనా విపక్షాలదేనన్నమాట.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!