cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇదేం న్యాయం పవన్.. మహిళలు ఎక్కడ?

ఇదేం న్యాయం పవన్.. మహిళలు ఎక్కడ?

మహిళా సాధికారతకు కృషి చేస్తానంటారు, చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు సాధిస్తానంటారు. వీర మహిళ పేరుతో పార్టీలో ఓ విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఇంతాచేసినా ఎన్నికల్లో టికెట్లు కేటాయించే విషయంలో మాత్రం మహిళలకు అన్యాయం చేశారు పవన్ కల్యాణ్. చట్టసభల్లో రిజర్వేషన్లకు కృషిచేస్తానంటూ చెప్పుకునే పవన్ కల్యాణ్.. తమ పార్టీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ లో మాత్రం మహిళలకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు.

32 మందితో తొలి జాబితాను విడుదల చేసింది జనసేన. ఇందులో కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశాలిచ్చారు. మాటల్లో 33శాతం, కానీ చేతల్లో 10శాతం అని తేలిపోయింది. తర్వాతి జాబితాలో అయినా మహిళలకు న్యాయం చేస్తారా అంటే అదీలేదని స్పష్టమవుతోంది. జనసేన నుంచి వచ్చిన మొదటి జాబితానే కాస్తో కూస్తో నిజాయితీగా ప్రకటించింది. తర్వాత వచ్చే లిస్ట్ లో పవన్ కల్యాణ్ మినహా మిగతాచోట్ల చెప్పుకోదగ్గ అభ్యర్థులు లేరు. ఒకవేళ అలాంటి చోట్ల మహిళల పేర్లు ప్రకటించినా అది తనకు వెసులుబాటు లేకే అనుకోవాలి.

జనసేన ప్రకటించిన పస్ట్ లిస్ట్ లో నెల్లిమర్ల, పి.గన్నవరం, రాజంపేట.. నియోజకవర్గాల్లో మాత్రమే మహిళా అభ్యర్థులున్నారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఊహించినట్టుగానే ఎన్నారైలు, వలస నేతలకే పవన్ పెద్దపీట వేశారు. జనసేన ఆవిర్భావం నుంచీ ఉన్న వాళ్లను పూర్తిగా పక్కనపెట్టేశారు. నిరుపేదలు, మధ్యతరగతి, కొత్త రక్తం అంటూ మాటలు చెప్పే పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో బాగా ఖర్చుపెట్టుకోగలిగే అభ్యర్థులనే ఏరికోరి ఎంపిక చేసుకున్నారు.

అటు లోక్ సభ కు ప్రకటించిన నలుగురు అభ్యర్థుల్లో ఒక్కరు కూడా మహిళ లేరు. ప్రత్యర్థుల విమర్శలు కాచుకోవాలంటే.. విడుదల చేసే ప్రతి జాబితాలోనూ సామాజిక సమతూకం పాటించాలి. టీడీపీ అయినా, వైసీపీ అయినా.. ఇదే ఫార్ములాతో లిస్ట్ లు రిలీజ్ చేస్తుంటాయి. కానీ పవన్ ఆవేశంతో తొలి జాబితా బైటకు వదిలేసి.. విమర్శలపాలవుతున్నారు. పవన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. 

చంద్రబాబు చేసిందే నేను చూపిస్తున్నా.. వర్మ

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!