cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ కు పృధ్వీ కౌంటర్

పవన్ కు పృధ్వీ కౌంటర్

నటుడు పృధ్వీరాజ్ పూర్తిగా పాయింట్ బేస్డ్ గా సరైన కౌంటర్లు ఇస్తున్నారు. ఆ విధంగా ఆయన ఓ సీనియర్ అండ్ సిన్సియర్ పొలిటీషన్ కూడా చేయలేని విధంగా వైకాపా కోసం చేస్తున్నారు. లేటెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా ఆయన మాంచి కౌంటర్ ఇచ్చారు.

బిసిల మీద ప్రేమవుంటే కడప సీటు బిసిలకు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అక్కడికేదో తాను గొప్ప ప్రశ్న అడిగానని, జగన్ ను ఇరుకున పెట్టానని మురిసిపోయారు. కానీ ఆయన అదే క్వశ్చను బాబును అడగలేరు. కుప్పం సీటును బిసిలకు ఇవ్వవచ్చు కదా అని మాత్రం అడగరు.

ఇదిలావుంటే ఇన్ని కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ రాజమండ్రి, గుంటూరు, అనగాపల్లి, ఏలూరు, ఎంపీ సీట్లు కాపులకు కాకుండా బిసి, ఎస్సి, లేదా బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వలేదు అని నటుడు పృధ్వీరాజ్ కౌంటర్ వేసారు. ఈ మేరకు ఆయన మీమ్ తయారుచేసి స్టేటస్ లో పెట్టుకోవడమే కాకుండా, సోషల్ మీడియాలోకి వదిలారు.

తన తెలుగుదేశం అనుబంధం దాచుకుని మాటలతో మాయ చేస్తూ కాలక్షేపం చేసే పవర్ స్టార్ కు ఇలాంటి సరైన కౌంటర్లు మరిన్ని పడితే, అసలు రంగు బయటకు వస్తుంది.