cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ కల్యాణ్.. వాడీవేడి ఎందుకు తగ్గింది?!

పవన్ కల్యాణ్.. వాడీవేడి ఎందుకు తగ్గింది?!

మొన్నామధ్య క్రిస్మస్ విరామం తీసుకునేంత వరకూ పవన్ కల్యాణ్ ఎప్పుడు తన ఫ్యాన్స్ ముందుకు వచ్చినా.. ధూం.ధాం.. అనేవాడు. అటు జగన్ ను గిల్లడమో, ఇటు చంద్రబాబును ఏదో ఒకటి అనడమో.. చేసేవాడు. ఒక విషయం అని కాదు.. ఆఖరికి జగన్ పై కులం వ్యాఖ్యలు చేయడానికి కూడా పవన్ కల్యాణ్ వెనుకాడలేదు!

అంతేకాదు.. స్వతంత్ర సమరయోధులకు కులాన్ని ఆపాదించడానికి కూడా పవన్ సంశయించలేదు. ఏదో ఒక సెన్షేషనల్ కామెంట్ చేసి.. స్పైసీ, మసాలా హెడ్డింగులు పెట్టుకునే యూట్యూబ్ చానల్ తరహా రాజకీయాలు చేస్తూ వచ్చాడు పవన్ కల్యాణ్. అయితే క్రిస్మస్ సెలవులు, నూతన సంవత్సరం వచ్చాకా.. పవన్ కల్యాణ్ మాసాలా మాటలు మాట్లాడటం బాగా తగ్గించాడు.

అసలు పవన్ తన ఫ్యాన్స్ ముందుకు వస్తున్నాడా.. లేదా.. అన్నట్టుగా మారిపోయింది కథ. ఈ సమయంలో పవన్ కల్యాణ్ వివిధ చోట్ల అభిమానులతో సమావేశం అవుతూ ఉన్నాడు. వాళ్లకు బోధలు చేస్తూ ఉన్నాడు. టికెట్లు ఎవరు ఆశించాలి, ఎవరు ఆశించకూడదు.. అనే అంశాల గురించి పవన్ వివరించి చెబుతూ ఉన్నాడు.

అయితే గత నెలలో మాట్లాడిన మసాలా మాటలు మాత్రంలేవు. అలా మాట్లాడితే.. అప్పటికప్పుడు ఏవో చప్పట్లు కొట్టించవచ్చు కానీ.. రాజకీయంలో మనగలగడం సాధ్యంకాదని పవన్ కు అర్థమైందా? 

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది