cloudfront

Advertisement


Home > Politics - Gossip

పివిపి సరే.. మరి బాబుగారి మాటేమిటి?

పివిపి సరే.. మరి బాబుగారి మాటేమిటి?

ఎప్పటికామాటలాడువాడు ధన్యుడు అన్నాడు వెనకటికి సుమతీకారుడు. విజయవాడ వైకాపా ఎంపీ కేండిడేట్ పివిపి హోదాను బోరింగ్ సబ్జెక్ట్ అన్నారు అంటూ యాగీ మొదలుపెట్టారు తెలుగుదేశం జనాలు. ఇక్కడ రెండు పాయింట్లు వున్నాయి. అసలు జరిగింది ఏమిటి?

నిన్నటికి నిన్న జరిగిన ఓ సమావేశంలో పివిపి కన్నా ముందు పలువురు మాట్లాడారు. వాళ్లంతా హోదా గురించి మాట్లాడారు. అందువల్ల పివిపి మాట్లాడుతూ అందరూ హోదా గురించి మాట్లాడారు. మళ్లీ తాను కూడా అదే మాట్లాడితే బోర్ కొడుతుంది అన్నారు. అది యాగీకి అసలుకారణం.

సరే, ఇక రెండో పాయింట్ కు వద్దాం. అసలు హోదా మీద గతంలో చంద్రబాబు అన్నమాటలు ఏమిటి? హోదావల్ల ఏం వొరుగుతుంది అని ఆయన అనలేదా? హోదా వచ్చిన రాష్ట్రాలు ఏ మేరకు అభివృద్ది సాధించాయి అని చంద్రబాబు అనలేదా? హోదాకు బదులు ప్యాకేజీ ముద్దు అని ఆయన అనలేదా? అవే మాటలను చాలామంది తెలుగుదేశం జనాలు రిపీట్ చేయలేదా?

అవన్నీ మరిచిపోయి, ఇప్పుడు మళ్లీ హోదా పాట పాడుతున్నారు కాబట్టి, పివిపిని పట్టుకుని యాగీ చేస్తున్నారు. మరి ఆ పాత వీడియోలు అన్నీ బయటకు తీస్తే బాబు కానీ ఆయన అనుచరులు కానీ ఏం సమాధానం చెబుతారు?

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?

సీక్రెట్ గా లెటర్ రాస్తే.. ఆంధ్రజ్యోతికి ఎలా వచ్చింది.. పోసాని