cloudfront

Advertisement


Home > Politics - Gossip

టీడీపీ అతి ఆరాటం, వాళ్లను ఓడిస్తారా?

టీడీపీ అతి ఆరాటం, వాళ్లను ఓడిస్తారా?

పార్టీలు మారుతున్న నేతలు.. తమ ఇంట్లో వాళ్లను సరిగా వెంట తీసుకెళ్లలేకపోతున్నారు. ఇక ఎన్నికల్లో పోటీకి దిగాకా కూడా వీళ్లకు సొంత నియోజకవర్గాల్లోనే గెలుస్తామో ఓడతామో తెలియడంలేదు. ఏవో సమీకరణాలు కలిసి వచ్చినప్పుడు, వీళ్ల హామీలను ప్రజలను గట్టిగా నమ్మితే తప్ప వీళ్లకు ఎన్నికల్లో విజయం సాధ్యం కావడంలేదు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఉంటున్నా.. ఎవరూ ప్రజానేతలేమీ కాదు. అయితే ఇప్పుడు వీళ్లు పక్క రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతుండటం కామెడీగా మారింది.

కర్ణాటకలో భారతీయజనతా పార్టీని ఓడించేస్తాం.. అని అంటున్నారు రాయలసీమ తెలుగుదేశం నేతలు. కర్ణాటకలో ఏవో కుల సంఘాల సమావేశాలకు హాజరవుతున్న నేతలు.. పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఏపీకి బీజేపీకి అన్యాయం చేసిందని, అందుకే ఇప్పుడు కర్ణాటకలో బీజేపీని ఓడిస్తామని తెలుగుదేశం నేతలు అంటున్నారు. కర్ణాటకలోని తెలుగు వాళ్లు ఎవరూ బీజేపీకి ఓటు వేయొద్దు అని వీళ్లు పిలుపుని ఇస్తున్నారు.

అయితే ఇక్కడ తెలుగుదేశం నేతల కాన్ఫిడెన్స్‌ ఏమిటంటే.. కన్నడనాట ఎలాగూ బీజేపీ కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకాలు కనిపించడం లేదు. అందుకే.. ఇప్పుడు వీళ్లు ధైర్యంగా ఈ మాటలు అంటున్నారు. రేపు బీజేపీ ఓడిపోతే.. మేం చెప్పాం కదా, మా పిలుపును అనుసరించే కర్ణాటకలోని తెలుగు వాళ్లంతా ఓటు వేశారు, అందుకే అక్కడ బీజేపీ ఓడిపోయింది అని వీళ్లు ప్రచారం చేసుకోవడానికి తగిన గ్రౌండ్‌ను ఇప్పటి నుంచి ప్రిపేర్‌ చేసుకుంటున్నారు.

రాయలసీమతో సరిహద్దును కలిగిన కర్ణాటక జిల్లాల్లో సామాజికవర్గాల జనాభా ఆల్మోస్ట్‌గా రాయలసీమలో ఉన్నట్టుగానే ఉంటుంది. సీమలోని ప్రధాన కులాలే కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో కూడా ఇదే నిష్ఫత్తిలో ఉంటాయి. అయితే రాజకీయ సమీకరణాలు మాత్రం వేరు! ఒక జిల్లాకూ మరో జిల్లాకూ రాజకీయ సమీకరణాల్లో మార్పు ఉన్నట్టుగానే కర్ణాటలోనూ చాలామార్పు ఉంటుంది. అయితే ఆ సమీకరణాల్లో ఇప్పుడు బీజేపీ మరీ చిత్తుగానూ ఓడిపోయేలా లేదు, అలాగని కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకమూ లేదు.

త్రిముఖ పోరు జరుగుతుండటంతో కర్ణాటక ఫలితాలు ఇలా ఉంటాయని చెప్పడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా పోతోంది. ద్విముఖ పోరు జరిగితే అదో లెక్క. ట్రైయాంగిల్‌ ఫైట్‌ కాబట్టి ఏమైనా జరగొచ్చు. జేడీఎస్‌ బాగా పుంజుకుందనే  మాట వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో మోడీ పాలనతో విసిగిపోయారు, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌తో విసిగిపోయారు.

ఈ నేఫథ్యంలో జేడీఎస్‌ను జనాలు బాగానే ఆదరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊపేకుహా.. అన్నట్టుగా కర్ణాటక రాజకీయాల మీద సీమ తెలుగుదేశం నేతల కామెంటున్నాయి!