cloudfront

Advertisement


Home > Politics - Gossip

‘వైస్రాయి మీట’ నొక్కి టికెట్ దక్కించుకున్నారు!

‘వైస్రాయి మీట’ నొక్కి టికెట్ దక్కించుకున్నారు!

ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుంది. టెక్నాలజీ అంటే అదే. ఇప్పుడు చంద్రబాబునాయుడు మీద కూడా టికెట్ల కేటాయింపు విషయంలో అలాంటి ఒత్తిడులు పనిచేస్తున్నాయి. చంద్రబాబు ‘కీ’లకం ఎక్కడ ఉందో మర్మం తెలిసిన కొందరు నేతలు.. ఆయన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే టికెట్లు దక్కించుకోగలిగారని.. ఇప్పుడు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి సిటింగ్ ఎమ్మెల్యే గా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే, బొజ్జలను మంత్రిపదవి నుంచి తొలగించిన తర్వాత.. ఆయనకు టికెట్ కూడా అనుమానమే అని ముమ్మరంగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే.. స్థానికంగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడునుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా వాతావరణం మారింది.

ఎస్సీవీ నాయుడు తన కేబుల్ నెట్ వర్క్ ను కూడా విక్రయించేసి ఎన్నికల కోసం సొమ్ము సమకూర్చుకున్నాడనే ప్రచారం జరిగింది. అదే సమయంలో బొజ్జల కుటుంబంపై నియోజకవర్గంలో పెద్దగా వ్యతిరేకతలు కూడా వ్యక్తం అవుతూ వచ్చాయి. దీంతో ఎస్సీవీకి టికెట్ ఖరారు అని అంతా అనుకున్నారు.

చంద్రబాబు హామీ ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. అయితే తొలి విడతలోనే బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డి పేరును ప్రకటించారు. అయితే ఈ పరిణామం చోటుచేసుకోవడం వెనుక చాలా మంత్రాంగం నడిచినట్టు కనిపిస్తోంది. బొజ్జల భార్య బృందమ్మ చాణక్యం పనిచేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

1995లో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా గద్దెఎక్కిన ఎపిసోడ్ లో కీలకంగా వ్యవహరించిన ఒక వ్యక్తి మద్దతుతో సుధీర్ రెడ్డికి టికెట్ దక్కినట్టుగా వినిపిస్తోంది. సదరు వైస్రాయి ఎపిసోడ్ వ్యక్తితో తమకున్న బంధుత్వాన్ని వాడుకుని.. బొజ్జల వర్గం ఆయన ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారని.. ఏతావతా.. ఎస్సీవీని పక్కనపెట్టి.. సుధీర్ కు టికెట్ ఇచ్చారని అనుకుంటున్నారు.

ఎస్సీవీ వర్గం అసంతృప్తితో ఉంటే గనుక, అదే సమయంలో నియోజకవర్గంలో గెలుపు దక్కడానికి... బొజ్జల సుధీర్ చెమటోడ్చాల్సిందేనని పలువురు అనుకుంటున్నారు.

చంద్రబాబు చేసిందే నేను చూపిస్తున్నా.. వర్మ

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!