cloudfront

Advertisement


Home > Politics - Political News

మరోసారి బాబుకు ఝలక్ ఇచ్చిన ఉద్యోగులు

మరోసారి బాబుకు ఝలక్ ఇచ్చిన ఉద్యోగులు

గతంలో ఓసారి చంద్రబాబు కేవలం రాష్ట్ర ఉద్యోగుల వల్ల ఓడిపోయారు. ఉద్యోగుల్ని రాచిరంపాన పెట్టడంలో వాళ్లంతా బాబుకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఈసారి కూడా ఉద్యోగులంతా మూకుమ్మడిగా బాబును తిరస్కరించినట్టు తెలుస్తోంది.

ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు లెక్కించారు. ఈ లెక్కింపులో టీడీపీకి గట్టిదెబ్బ తగిలింది. దాదాపు ఉద్యోగులంతా వైసీపీకి అనుకూలంగా ఓటేశారు. ఇలా చంద్రబాబుకు ఈరోజు ఉదయమే గట్టిదెబ్బ తగలగా, ఉద్యోగస్తులు మరోసారి బాబుపై తమ కసి తీర్చుకున్నారు.

చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగులకు నిద్ర ఉండదు. వాళ్లను ప్రశాంతంగా ఉండనివ్వరు బాబు. అడ్డమైన పనులన్నీ ఉద్యోగులకే అంటగడతారు. చివరికి తన పార్టీ పనుల కోసం కూడా ఉద్యోగుల్ని వాడుకున్న దాఖలాలు కోకొల్లలు.

పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉందని తెలిసి కూడా ఉద్యోగుల్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తిప్పారు. ఆదివారాలు కూడా విశ్రాంతి లేకుండా చేశారు. ఈ కోపం మొత్తం పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టంగా కనిపించింది. ఈ ఫలితాల నుంచే చంద్రబాబు పతనం మొదలైంది. తర్వాత అదే ట్రెండ్ ఈవీఎంలలో కూడా కొనసాగింది.