cloudfront

Advertisement


Home > Politics - Political News

కౌంటింగ్ః కాంగ్రెస్ కు ఊరట అక్కడ మాత్రమే!

 కౌంటింగ్ః కాంగ్రెస్ కు ఊరట అక్కడ మాత్రమే!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాజస్తాన్ లో మాత్రమే కాస్త ఊరట లభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజస్తాన్ కాంగ్రెస్ వశం అవుతుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతూ  ఉంది. ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వేలు కూడా అదే మాటే చెప్పాయి. కౌంటింగ్ కూడా అందుకు అనుగుణంగానే సాగుతున్నట్టుగా ఉంది. 

ఇప్పటికే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాభైకి పైగా స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తూ ఉన్నట్టుగా జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ మరీ చతికిలపడిపోలేదు. బీజేపీ ముప్పైకి పైగా స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. అయితే అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే రాజస్తాన్ మొగ్గు ఉంటుందని స్పష్టం అవుతోంది.

ఇక మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల కౌంటింగ్ అత్యంత ఆసక్తిదాయకంగా సాగుతూ ఉంది. అక్కడ కాంగ్రెస్, బీజేపీలు అమీతుమీ తలపడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకూ ఉన్న ఫలితాల్లో చెరిసగం సీట్లలో ఆధిక్యతను కొనసాగిస్తూ ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో బీజేపీనే కాస్త ముందు కనిపిస్తూ ఉంది. ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ నాలుగోసారి వరసగా అధికారాన్ని సొంతం చేసుకునే యత్నంలో ఉంది. బీజేపీకి కాంగ్రెస్  ధీటుగా కనిపిస్తోంది కానీ… ఎవరు నెగ్గినా తేడా పెద్దగా ఉండే అవకాశాలు లేవు. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడం విశేషం. 

పోస్టల్ బ్యాలెట్స్ లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ పొందలేకపోయింది. వీటిల్లో తెరాస చాలా చోట్ల స్పష్టమైన ఆధిక్యతను సంపాదించుకుంటోంది. ఇవి అర్లీ ట్రెండ్స్ మాత్రమే. అసలు కథ ఏమిటో మరి కాసేపట్లో తేలిపోతుంది.