cloudfront

Advertisement


Home > Politics - Political News

వైఎస్సార్సీపీలోకి మరో ప్రముఖుడు!

వైఎస్సార్సీపీలోకి మరో ప్రముఖుడు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా ప్రకటించారు మైదుకూరు మాజీఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి. గత కొన్నాళ్లుగా పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉండి రెండువైపులా ప్రయత్నించిన డీఎల్ రవీంద్రారెడ్డి చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న విషయాన్ని ప్రకటించారు. వైఎస్ వ్యతిరేక శిబిరంలోని వ్యక్తిగా వ్యవహరించిన డీఎల్ ఇప్పుడు జగన్ పార్టీలోకి చేరబోతుండటం విశేషం.

కొన్నాళ్ల కిందటే డీఎల్ అనుచరులు కొంతమంది వెళ్లి జగన్ ను కలిశారు. మైదుకూరు టికెట్ ఆయనకు కేటాయించాలని వారు కోరారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టడానికి ఇష్టపడని జగన్ వచ్చి  చేరాలని, వేరే అవకాశాలు ఏమైనా చూస్తామని చెప్పారట. అయితే డీఎల్ మాత్రం తను ఎమ్మెల్యేగానే పోటీచేయాలని అప్పుడు వెనక్కు తగ్గారు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా సంప్రదింపులు జరిగాయి. అయితే చినబాబు అడ్డుపుల్ల వేసినట్టుగా టాక్. కేవలం ఆర్థికంగా కోటీశ్వరుడు అనే కారణం చూపి.. టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ కు మైదుకూరు టికెట్ కేటాయించారు. అక్కడ ఆయన నెగ్గే అవకాశం లేదని రిపోర్టులు వచ్చినా.. డబ్బును పరిగణనలోకి తీసుకుని ఆయనకు టికెట్ కేటాయించారట చినబాబు. దీంతో చంద్రబాబు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి డీఎల్ తో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. పార్టీలోకి చేరాలని జగన్ ఫోన్ చేసి అడగడంతో రవీంద్రారెడ్డి చేరడానికి రెడీ అయ్యారని సమాచారం. అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యతను ఇస్తామనే హామీతో డీఎల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. మైదుకూరు నుంచి మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు డీఎల్.

పరిటాల కుటుంబం గెలిస్తే.. వీళ్లంతా పారిపోవాల్సిందే

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?