cloudfront

Advertisement


Home > Politics - Political News

కేంద్రం చేతిలో పవన్ పెన్ డ్రైవ్: నిజమెంత?

కేంద్రం చేతిలో పవన్ పెన్ డ్రైవ్: నిజమెంత?

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ ఇదే. పవన్ గుట్లు తెలిపే ఓ పెన్ డ్రైవ్ కేంద్రం చేతికి వెళ్లిందని, అందుకే బీజేపీ నేతలు చెబుతున్నట్టల్లా జనసేనాని ఆడుతున్నారనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ ఆ పెన్ డ్రైవ్ ఏంటి..? పత్రికల్లో రాని ఈ మేటర్ సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయింది?

కొన్ని రోజుల కిందట పవన్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీదాడులు జరిగాయట. ఆ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలతో పాటు మరికొన్ని వీడియోలను కూడా అధికారులు పెన్ డ్రైవ్ లో తీసుకెళ్లారట. దాన్ని కేంద్రం చేజిక్కించుకుందట. ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ, ఓ ఆట ఆడిస్తోందట. 

దీంతో చేసేదేం లేక కేంద్రం పెద్దలు చెబుతున్నట్టు పవన్ నడుచుకుంటున్నాడనేది ఈ పెన్ డ్రైవ్ కథ. ఇందులో భాగంగానే చంద్రబాబు, లోకేష్ పై పవన్ అవినీతి ఆరోపణలు చేస్తున్నారట. లేదంటే పవన్ కు అంత సీన్ లేదని, టీడీపీతోనే మరోసారి దోస్తీ కట్టడానికి ఆయన మొగ్గుచూపారని అంటున్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతిపై ఏకంగా విచారణ జరిపించాలనే డిమాండ్ కూడా పెన్ డ్రైవ్ మూలంగానే తెరపైకొచ్చిందని అంటున్నారు. 

ఈమధ్య ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. మీ ఇంటిపై ఐటీ దాడులు జరిగిన మాట నిజమేనా అని ప్రశ్నించింది. దీనికి పవన్ ముక్తసరిగా సమాధానమిచ్చారు. తనకు ఎన్ని ఆస్తులున్నాయో అందరికీ తెలుసన్నారు. అయినా తను ప్రిపేర్ అయి ఇంటర్వ్యూకు రాలేదని, మరోసారి ఈ అంశంపై స్పందిస్తానని తప్పించుకున్నారు.

పవన్ వ్యాఖ్యల్ని జాగ్రత్తగా గమనిస్తే, ఆయన టీడీపీపై మాత్రమే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీకి జనసేనకు సంబంధం లేదంటున్నారే తప్ప, ఆ నేతలపై మాత్రం ఆయన విరుచుకుపడ్డం లేదు. ఇవన్నీ చూస్తుంటే.. "పెన్ డ్రైవ్ కథ" నిజమేమో అనిపిస్తుంది. అంతా బాగానే ఉంది కానీ, సదరు పెన్ డ్రైవ్ లో కొన్ని వీడియోలు కూడా ఉన్నాయనే ప్రచారం మాత్రం అందర్నీ భలే ఎట్రాక్ట్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలు ఏంటో..? నిజంగా ఇది చిదంబర రహస్యమే.