cloudfront

Advertisement


Home > Politics - Political News

రేణుదేశాయ్ పై మౌనంగా ఉండడం మగతనమా?

రేణుదేశాయ్ పై మౌనంగా ఉండడం మగతనమా?

ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నారు. తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడకూడదని సహనంగా ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ మితిమీరి, హద్దులుదాటి చేస్తున్న విమర్శలను తట్టుకోలేకపోయారు జగన్. అందుకే సహనాన్ని వీడారు. పవన్ పై పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. తన స్థాయికి పవన్ పై విమర్శలు చేయడం అనవసరం అనే విషయం తెలిసి కూడా, తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ పై ప్రతివిమర్శలు చేశారు జగన్.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో పాదయాత్ర చేస్తున్న జగన్, పట్టణంలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ పై పలు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లకో పెళ్లి చేసుకుంటే మగతనం అవుతుందా అని పవన్ ను సూటిగా ప్రశ్నించారు జగన్.

"పవన్ కల్యాణ్ మగతనం గురించి మాట్లాడుతున్నాడు. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థను ఈ పెద్దమనిషి రోడ్డు మీదకు తెచ్చాడు. నిత్యపెళ్లికొడుకులా నాలుగేళ్లకు ఒకసారి పెళ్లి చేసుకోవడం మగతనమా అని అడుగుతున్నాను."

రేణుదేశాయ్ ను సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ వేధిస్తుంటే.. అడ్డుచెప్పకుండా మౌనంగా ఉండడం మగతనమా అని పవన్ ను ప్రశ్నించారు జగన్. ఒక ఆడపడుచును ఫ్యాన్స్, కార్యకర్తలు ఆడిపోసుకుంటుంటే.. పవన్ చోద్యం చూస్తూ కూర్చున్నారని దుయ్యబట్టారు.

"ఇదే పవన్ గురించి ఆయన రెండోభార్య రేణుదేశాయ్ అన్నమాటలు మీకు చెబుతాను. రేణు దేశాయ్ తో కాపురం చేస్తుండగానే వేరే స్త్రీని గర్భిణిని చేసి, ఆ పిల్లాడ్ని పవన్ ఇంటికి తీసుకొచ్చాడని రేణుదేశాయ్ చెప్పింది. ఏకంగా టీవీల ముందు రేణుదేశాయ్ ఈ మాటచెప్పారు. రేణుదేశాయ్ ఇలా నిజాలు చెప్పినందుకు పవన్ కార్యకర్తలు ఆవిడ్ని సోషల్ మీడియాలో వేధించారు. అప్పుడు మౌనంగా ఉండడం మగతనమా పవన్?"

నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. ప్రజల్ని కల్లబొల్లి మాటలతో మోసంచేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ విరుచుకుపడ్డారు. పవన్ ప్రతిమాట వెనక చంద్రబాబు స్క్రీన్ ప్లే, డైరక్షన్ ఉన్నాయని ఆరోపించారు.

"చంద్రబాబే స్క్రిప్ట్ రాస్తాడు, డైరక్షన్ కూడా చేస్తాడు. యాక్షన్ మాత్రం పవన్ కల్యాణ్ ది. ఈ పవన్ కల్యాణ్ సినిమాకు లింగమనేని నిర్మాత. ఈ పవన్ కల్యాణ్ సినిమాలో ఇంటర్వెల్స్ ఎక్కువ, సినిమా తక్కువ. చంద్రబాబు ఎప్పుడు పేమెంట్ ఇస్తే, పవన్ అనే పెద్దమనిషి బాబుకు అనుకూలంగా కాల్షీట్లు ఇస్తుంటాడు."

నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిన ప్రతి అవినీతిలో భాగస్వామిగా ఉన్న పవన్.. ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు స్క్రీన్ ప్లే ప్రకారం టీడీపీ నుంచి బయటకు వచ్చారని జగన్ ఆరోపించారు. బాబు అవినీతిపై విమర్శించకుండా, ప్రతిపక్షంలో ఉన్న తనపై ఆరోపణలు చేస్తున్నారని, పవన్ లాలూచీ రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు జగన్.

"నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబుతో కలిసి పవన్ కాపురం చేశారు. చంద్రబాబు చేసిన ప్రతిమోసంలో, చెప్పిన ప్రతి అబద్ధంలో, చేసిన అవినీతిలో పవన్ భాగస్వామిగా ఉన్నాడు. ఈ పెద్దమనిషి నాలుగున్నరేళ్లు చంద్రబాబుతో దోస్తీకట్టాడు. సరిగ్గా ఎన్నికలకు 6 నెలల ముందు, చంద్రబాబుతో విడిపోయినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి, లాలూచీ రాజకీయాలు చేస్తున్నాడు."

అవినీతిపరుడంటూ తనపై విమర్శలు చేస్తున్న పవన్.. తన అవినీతి బాగోతాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అజ్ఞాతవాసి ముసుగులో పవన్ చేసిన అవినీతి గురించి, లింగమనేనితో కలిసి రాజధాని ప్రాంతంలో పవన్ కొనుగోలు చేసిన ఆస్తుల గురించి ప్రజలకు వివరించారు.

"ప్రతిపక్షంలో ఉన్నాం. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. చంద్రబాబు అవినీతి, అధర్మం మీద పోరాటం చేస్తున్నాం. ఆయన అన్యాయాల్ని ఎదిరిస్తున్నాం. ఈ నాలుగున్నరేళ్ల కాలంగా రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా అక్కడ మొదట కనిపించిన వ్యక్తిని నేను. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటిది ఈ పవన్ కల్యాణ్ అనే వ్యక్తి, నాలుగున్నరేళ్లు చంద్రబాబు మోసాల్లో పార్టనర్ గా ఉండి ఇప్పుడు నాపై ఆరోపణలు చేస్తున్నాడు. ఇదే పవన్ కల్యాణ్ ను అడుగుతున్నాను, నేను అవినీతిపరుడ్ని అని చెబుతున్నావు కదా, నువ్వేమైనా చూశావా?"

చంద్రబాబుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని రాజకీయాలు చేస్తున్న పవన్ ను తరిమికొట్టాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు జగన్. అనంతపురంలో పవన్ తనపై చేసిన ఆరోపణలు, విమర్శలకు ఇలా రాజాం వేదికగా దీటుగా జవాబు చెప్పారు వైఎస్ఆర్సీ అధినేత జగన్. 

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?