cloudfront

Advertisement


Home > Politics - Political News

‘పవన్ మేం చాలా మందికి తోలు తీశాం!’

‘పవన్ మేం చాలా మందికి తోలు తీశాం!’

''తోలు దీస్తా. తాట దీస్తా.. పంచెలు ఊడగొడతా.. అంటే నడిచే రోజులు పోయాయి పవన్ కల్యాణ్..'' అంటూ హితబోధ చేశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమార్కుడు అని, అతడి అంతుచూస్తా అన్నట్టుగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించాడు. పవన్ కల్యాణ్ నోరేసుకుని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడని... అలాంటి మాటలను తామ ఏనాడో మాట్లాడామని జేసీ జూనియర్ అన్నాడు.

అందుకే తనను అంతా నోరున్నోడు అని అంటారని, తను కూడా చాలామంది తోలు తీశానని, చాలామంది తాటతీశానని, చాలా మందికి పంచెలు ఊడగొట్టాను అని.. అన్నీ చేసే ఇప్పుడు మెత్తబడ్డామని జేసీ చెప్పుకొచ్చాడు. అయితే తాము ఏం చేసినా వ్యవస్థలో భాగమై చేశామని జేసీ అన్నాడు.

ఓటు అడగడం ఎలాగో పవన్ తెలుసుకోవాలని.. అంటూ అత్తారింటికి దారేదీ సినిమా క్లైమాక్స్ సీన్ ను గుర్తుచేశాడు జేసీ. ‘నీ కోసం పావలా భాగం పెట్టాం అత్తా..' అడిగినట్టుగా ఓటు అడుక్కోవాలి కానీ.. ఇలా మాట్లాడితే కుదరదు అని జేసీ అన్నాడు. పవన్ కల్యాణ్ ఒక పనికిమాలిన వాడు.. అంటూ జేసీ జనసేన అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్