cloudfront

Advertisement


Home > Politics - Political News

మోహన్‌బాబు.. దాచుకోలేకపోయారంతే.!

మోహన్‌బాబు.. దాచుకోలేకపోయారంతే.!

స్వర్గీయ నందమూరి తారకరామారావుకి అత్యంత సన్నిహితుల్లో సినీ నటుడు మోహన్‌బాబు కూడా ఒకరు. గతంలో టీడీపీ నుంచి మోహన్‌బాబు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా, ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చారు. వైఎస్సార్సీపీలో చేరతారనీ, పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఓ దశలో మోహన్‌బాబు తరఫున ఆయన కుమార్తె మంచులక్ష్మి రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న గుసగుసలూ విన్పించాయనుకోండి.. అది వేరే విషయం.

ఇక, తాజాగా మోహన్‌బాబు, తిరుపతిలోని తన విద్యాసంస్థల విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు.. చంద్రబాబు సర్కార్‌, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. ఈ క్రమంలో చంద్రబాబు మీద మోహన్‌బాబు దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేననీ, ఆయన నోట నిజాలు రావనీ తేల్చేశారు. ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ బకాయిలు ఇస్తానని చెప్పి, మోసం చేశావంటూ మోహన్‌బాబు, చంద్రబాబుపై ఆరోపించారు.

ఈ క్రమంలో, రాజకీయ విమర్శలు చేయనంటూనే రాజకీయాలు మాట్లాడక తప్పలేదు మోహన్‌బాబుకి. మరీ ముఖ్యంగా, 'వెన్నుపోటు' అంశంపై మోహన్‌బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ విషయంలో ఏం చేశారో చంద్రబాబు చూశాం, అలాంటి చంద్రబాబుకి ప్రజల్ని మోసంచేయడం పెద్ద కష్టమేమీ కాదని మోహన్‌బాబు అన్నారు.

కొన్నాళ్ళ క్రితం.. 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లోనే మోహన్‌బాబు, స్వర్గీయ ఎన్టీఆర్‌ గురించి 'నిజాలు' మాట్లాడదామనుకున్నారుగానీ, బాలయ్య మీద గౌరవంతో అప్పటికి ఆ అంశం గురించి టచ్‌ చేయకుండానే ప్రసంగం పూర్తికానిచ్చేశారు. 'నేను కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు' అనేశారాయన అప్పట్లో. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబుని మోహన్‌బాబు, వందలాది మంది విద్యార్థుల సాక్షిగా కడిగిపారేశారు.

ఇది ఎన్నికల సీజన్‌.. ఈ టైమ్‌లో మోహన్‌బాబు, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ బకాయిల కోసం చేపట్టిన దీక్ష, తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 'మోహన్‌బాబు, జగన్‌ కుమ్మక్కయ్యారు.. లేకపోతే, ఎన్నికల సమయంలో ఈ దీక్షలేంటి.? చేతనైతే, మోహన్‌బాబు, వైసీపీ జెండా పట్టుకుని తిరగాలి..' అంటూ టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. 

రాధాకృష్ణ నాతో పెట్టుకోకు నేను ఎదవని కాదు...

సురేఖ వద్ద పవన్ పర్సనల్ లోన్.. కోటి ఏడు లక్షలకు పైగా..