cloudfront

Advertisement


Home > Politics - Political News

తెలుగుకు తెగులు పట్టిస్తున్న నందమూరి!

తెలుగుకు తెగులు పట్టిస్తున్న నందమూరి!

ఒకవైపు లోకేష్ బాబే అనుకుంటే.. తెలుగుకు తెగులు పట్టించడంలో తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నామంటూ నందమూరి కుటుంబం అటెండెన్స్ వేయించుకుంటోంది. తెలుగు వాళ్లం .. తెలుగువారి ఆత్మగౌరవం.. అంటూ ముప్పూటలా మాట్లాడుతూ.. మళ్లీ అదే తెలుగును స్పష్టంగా పలకలేకపోవడం, సరిగా మాట్లాడలేకపోవడం నందమూరి, నారా కుటుంబాలకే సాధ్యం అవుతుంది.

అందరికీ అనర్గలంగా తెలుగుమాట్లాడే నైపుణ్యం ఉండాలని ఏమీ లేదు. కానీ.. తెలుగు పేరుతో రాజకీయ వ్యాపారం చేసుకుంటూ, తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగుదేశం అంటూ మాట్లాడేవాళ్ల తెలుగు మరీ కామెడీగా ఉండకూడదు కదా. కానీ.. అదే కామెడీ కంటిన్యూ అయ్యింది.

ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య తన అన్న కూతురు సుహాసిని నామినేషన్ సందర్భంగా చేసిన ప్రసంగం వెబ్ లో వైరల్ గా మారింది. తన సోదరుడి మరణం గురించి బాలయ్య మాట్లాడుతూ,., ఆయన మరణంతో అభిమానులంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు అని సెలవిచ్చాడు. అసలుకు బాలయ్యకు సంభ్రమాశ్చర్యం అంటే ఏమిటో తెలుసా?

ఏదో వర్డ్ బాగుందని యూజ్ చేసినట్టుగా ఉన్నాడు. అదేదో సినిమాలో కమేడియన్ సుధాకర్ తన ఫ్రెండ్ కు లెటర్ రాస్తూ... గంగా బాగీరథ సమానుడైన అంటూ మొదలుపెడతాడు. అది మొగుడు పోయిన వాళ్లకు వాడే పదం అని ఏవీఎస్ చెబుతాడు.. నాలుక్కరుచుకున్న సుధాకర్ ఏదో పదం బాగుంది కదా.. అని వాడానంటాడు.

ఇప్పుడు బాలయ్య కథ కూడా అలానే ఉంది. హరికృష్ణ మరణంతో అభిమానులు సంభ్రమాశ్చర్యలకు గురయ్యారట.. అంటే స్వీట్ సర్ ప్రైజ్ కు గురయ్యారు అనేది బాలయ్య ఉద్దేశం! బాలయ్య కన్నా లోకేషే ప్రతిభావంతుడులాగా ఉన్నాడు. ఆయన జయంతిని కాస్తా వర్ధంతిగా చేశాడు.

అతడి కన్నా ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా నందమూరి నటసింహం ప్రసంగించాడు. ఇక తాజాగా తెరపైకి వచ్చిన నందమూరి సుహాసిని.. ఒక్కో తెలుగు అక్షరాన్ని కూడబలుక్కుని మాట్లాడిన తీరు.. మరో ఎత్తు! ఎవ్వరికి ఎవరూ తగ్గేలా లేరే!