cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ కల్యాణ్.. ఏంటీ ‘గూట్లే’ మాటలు!!

పవన్ కల్యాణ్.. ఏంటీ ‘గూట్లే’ మాటలు!!

అసలు విషయాన్ని పట్టించుకోకుండా.. పనికిమాలిన రీతిలో ఆలోచించే వాళ్లను గూట్లే అనొచ్చు అన్నట్టుగా పవన్ కల్యాణ్ కు సన్నిహిత రచయిత త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ సినిమాకే ఒక డైలాగ్ రాశాడు. ఇప్పుడు జనసేన అధినేత మాటలు కూడా ఇలానే ఉన్నాయి. జగన్ పాదయాత్రను ఎద్దేవా చేస్తూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అచ్చం గూట్లే రీతిన ఉన్నాయి.

జగన్ లాగా తను ముద్దులు పెట్టడానికి రాలేదని.. పవన్ కల్యాణ్ అంటున్నాడు. ఒకవైపు తనవి సంస్కార పూరిత రాజకీయం అని, సంస్కార పూరిత రాజకీయం చేస్తానని.. పవన్ కల్యాణ్ సుద్దులు చెబుతూ ఉంటాడు. మళ్లీ మాట్లాడేదేమో ఇలాంటి మాటలు. ఒకవేళ పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఇలా మాట్లాడితే ఏడ్చి మొత్తుకుంటాడు. అవతల వాళ్ల విషయంలో మాత్రం ఒక కుసంస్కారిలా మాట్లాడతాడు పవన్ కల్యాణ్.

సంస్కారం గురించి నీతులు చెప్పే పవన్ కల్యాణ్.. జగన్ ఆప్యాయతతో ముద్దు పెట్టుకుంటే.. దాంట్లో కూడా దేన్నో చూడగలడని నిరూపించుకుంటున్నాడు. ఇక ఇదే సమయంలో పవన్ కల్యాణ్ బాధితులను కౌగిలించుకున్న, ముద్దులు పెట్టుకున్నా, గాఢంగా అదుముకున్న సందర్భాలు లేవా అంటే బోలెడన్ని ఉన్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలూ నెట్లో ఉన్నాయి.

అయితే నీతులు ఉన్నది ఎదుటి వారికి చెప్పడానికే అన్నట్టుగా పీకే వ్యవహరిస్తూ ఉన్నాడు. తన చూపు వెకిలిచూపు అని ఈ హీరో నిరూపించుకొంటూ ఉన్నాడు. వారం రోజులు ప్రజల మధ్యన తిరిగి నెలరోజులు విరామం తీసుకునే ఈ రాజకీయ నేత.. గత పదేళ్లలో కుటుంబంతో కన్నా జనం మధ్యనే ఎక్కువకాలం ఉన్న జగన్ గురించి వక్రమైన మాటలు మాట్లాడుతూ తన రేంజేమిటో అర్థమయ్యేలా చేస్తున్నాడు.

బడుగు బలహీన వర్గాలతో మమేకం అవుతున్న జగన్ విషయంలో ఇలాంటి మాటలతో పవన్ తన మనస్తత్వాన్ని కూడా చాటి చెబుతున్నాడు.