Advertisement


Home > Politics - Political News
'ఆ డబ్బులేవో పవన్‌ కల్యాణ్‌నే తీసుకోమనండి'

వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తానేదో నియోజకవర్గానికి పాతికకోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్దం చేశానని పవన్ కళ్యాణ్ అన్నారని విన్నాను.. ఆ డబ్బులేవో ఉంటే ఆయన్నే తీసుకోమని చెబుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

విలేకరులతో మాట్లాడుతూ.. ‘అవినీతి లేకుండా ఉండటానికే పెద్ద నోట్లురద్దు చేయమని చెప్పాను. ఇప్పుడు రెండువేల నోట్లు కూడా రద్దు చేయమని అడుగుతున్నా. అప్పుడు ఎన్నికల సమయంలో నోట్లు పంచే అవకాశం ఉండదు. విజయసాయిరెడ్డి ఇప్పటికీ తాను ప్రధాన మంత్రిని కలుస్తానని చెబుతున్నాడు. విజయసాయిరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 

పోలవరం అడ్డుకోవడానికి కుట్ర
ఎందుకు అవిశ్వాసం ఇచ్చామో కూడా కేంద్రం ఆలోచించడం లేదని, అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నా, దానిని కూడ తీసుకునే పరిస్థితి లేకుండా పోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో పోలవరం, తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టును ఎవరూ వదలుకోరని, ఎవరైనా దీనిని అడ్డుకోవడానికి యత్నిస్తే సహించబోరని అన్నారు. ఇందుకోసం కొన్ని కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముప్పై మూడువేల కోట్ల రూపాయలు కేవలం పునరావాసం, సహాయం కింద ఖర్చు పెట్టవలసి ఉందని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందే రాష్ట్రం సుమారు ఐదువేల కోట్ల రూపాయల మేర ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ఇంతవరకు రాష్ట్రం పన్నెండు వేలకోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగిందని ఆయన అన్నారు. దీనిపై రకరకాల ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

పట్టిసీమపై బీజేపే నేతలు ఇంతకు ముందు ఒక రకంగా, ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఏభై నాలగు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, మహా సంగమానికి శ్రీకారం చుడతామని ఆయన అన్నారు.