cloudfront

Advertisement


Home > Politics - Political News

ప్రజాశాంతి పార్టీ.. ఏకాలం కుట్రలు ఇవి!

ప్రజాశాంతి పార్టీ.. ఏకాలం కుట్రలు ఇవి!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ప్రత్యర్థులు ఇలాంటి సిల్లీ కుట్రలు చేయడం కొత్తకాదు. జగన్ తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కడప ఎంపీ సీటుకు బైపోల్స్ వచ్చినప్పుడు.. జగన్ తన పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద పోటీచేయగా, కనీసం అరడజను మంది జగన్ మోహన్ రెడ్డిలు కడప ఎంపీ సీటుకు వివిధ పార్టీల తరఫు నుంచి, ఇండిపెండెంట్స్ గా బరిలో నిలిచారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో మ్యాచ్ అయ్యేందుకు చాలామంది జగన్ మోహన్ రెడ్డిల చేత నామినేషన్లను దాఖలు చేయించారు. నాటి కాంగ్రెస్ పార్టీ మేధావులు అలాంటి కుట్రలను అమలు చేశారు. అయితే వాటి ప్రభావం ఎంతో అప్పుడే స్పష్టం అయ్యింది. అంత కుట్రచేసినా జగన్ మెజారిటీలో వంద ఓట్లను కూడా తగ్గించలేకపోయారు.

అయితే ఆ సిల్లీకుట్రలు మాత్రం ఆగడంలేదు. ఈసారి అలాంటి సిల్లీ కుట్రకు ప్రజాశాంతి పార్టీని వాడుకొంటూ ఉన్నారు. తెలుగు సినిమాల్లో కామెడీ తగ్గిపోయిందనుకుంటున్న ప్రజలకు ఆ లోటును భర్తీచేస్తున్న కేఏ పాల్ పార్టీ తరఫున రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న వారిచేత నామినేషన్లను దాఖలు చేయించారు.

ఒకచోట కాదు.. ఒక్క అనంతపురం జిల్లాలోనే.. ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసినవారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లతోనే ఉన్నవారు కావడం గమనార్హం. రాయదుర్గంలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కాపు రామచంద్రరెడ్డి కాగా, ప్రజాశాంతి పార్టీ తరఫున ఉడుముల రామచంద్రారెడ్డి అనే అడ్రస్ లేని వ్యక్తిని పోటీచేయించారు.

ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి కాగా, అదే పేరుతో ప్రజాశాంతి పార్టీ తరఫున మరోవ్యక్తి పోటీచేశాడు. అనంతపురం, కల్యాణదుర్గం, పెనుకొండ, కల్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లతో ఉన్న వారినే ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయించారు!

ఫ్యాన్ గుర్తును పోలి ఉన్నట్టుగా హెలీకాప్టర్ గుర్తును తెచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్ కాంబినేషన్స్ తోనే జెండాలను తయారు చేయించారు. ఓవరాల్ గా జనాలను కన్ఫ్యూజ్ చేయాలనే దారుణమైన, ఇదే సమయంలో సిల్లీ కుట్రను మాత్రం అమలు పెడుతున్నారని స్పష్టం అవుతోంది.

ఒక్క అనంతపురంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లతో మ్యాచ్ అయ్యేవాళ్లను వెదికి మరీ ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్ వేయించిన కుట్రను అమలు పెడుతూ ఉన్నారు. మరి దీని ప్రభావం కుట్రదారులకు అనుకూలంగా ఉంటుందా? ఫలితాలు వస్తే కానీ తెలియదు.

సీట్ల కేటాయింపులో జగన్‌ నేర్పరితనం!