cloudfront

Advertisement


Home > Politics - Political News

పృథ్వికీ తాడేపల్లి గూడెం టికెట్ దక్కుతుందా?

పృథ్వికీ తాడేపల్లి గూడెం టికెట్ దక్కుతుందా?

తను ఏ టికెట్ ఆశించడం లేదని చాలాసార్లు ప్రకటించారు నటుడు పృథ్విరాజ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడిగా ఉన్న ఈ నటుడు వివిధ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నటుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా దక్కింది. ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహం.. అని పృథ్విరాజ్ ప్రకటించారు.

ఆ సంగతలా ఉంటే.. సొంతూరు తాడేపల్లి గూడెం అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలనేది పృథ్విరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నారని టాక్. అయితే తను ఏ సీటునూ ఆశించడం లేదని పృథ్వి పలుసార్లు చెప్పారు.

కానీ.. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఆ టికెట్ విషయంలో మళ్లీ పృథ్వీ పేరు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. చాలా సినిమాల్లో సరదా ఎమ్మెల్యే పాత్రలను చేసిన ఈ నటుడికి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం వస్తుందో రాదో చూడాల్సి ఉంది.

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!