cloudfront

Advertisement


Home > Politics - Political News

ఢిల్లీలో చంద్రబాబు.. ఏపీలో డప్పు!

ఢిల్లీలో చంద్రబాబు.. ఏపీలో డప్పు!

'మీరే పెద్దన్నయ్య పాత్ర పోషించాలి..' అని చెప్పారట మాయావతి. 'మనమంతా ఒక్కటే' అన్నారట అఖిలేష్ యాదవ్. ఇలా చంద్రబాబుతో మాట్లాడరట అఖిలేష్, మాయవతి. మరి ఆ మాటలను వారు మీడియా ముందుకు వచ్చి ఏమీ చెప్పలేదు. వాళ్లు చంద్రబాబుతో చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన డప్పు మీడియాకు వినపడిపోయాయి! చంద్రబాబు నాయుడును మాయ, అఖిలేష్ లు ఎంతగా కీర్తించారో.. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేయడం బాధ్యతను చంద్రబాబు నాయుడు చేతికే వాళ్లు ఎలా ఇచ్చారో.. చంద్రబాబుకు, ఆయన అనుకూల మీడియాకు మాత్రమే తెలిసిన విషయాలు!

అయితే సామాన్యులకు మాత్రం చాలా డౌట్లున్నాయి. మొన్నటి వరకూ మోడీని పొగిడి, మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావాలంటూ ఎన్డీయే మీటింగులో తీర్మానం పెట్టి, మోడీని కీర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన చంద్రబాబు నాయుడు తమ వద్దకు వచ్చి ఇప్పుడు శంఖం ఊదుతూ ఉంటే.. మాయ, అఖిలేష్ లాంటి వాళ్లు ఈయనను ఎలా నమ్ముతున్నారు? అనేది సామాన్యులకు వచ్చే డౌట్.

చంద్రబాబు నాయుడు అవకాశవాదం గురించి ఎవరికీ తెలియనది ఏమీ కాదు. మొన్నటి వరకూ మోడీ చూపు తన మీద పడితే చాలన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. ఇప్పుడేమో మోడీని తిడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ను మొన్నటి వరకూ అనరాని మాటలు అన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్  పార్టీనే దిక్కు అని అంటున్నారు. ఇలాంటి అవకాశవాదాన్ని చంద్రబాబు నాయుడు కనబరుస్తూ ఉన్నారు. నిర్మొహమాటంగా తన తీరును అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నారు. 

ఇలాంటి చంద్రబాబును వాళ్లు నమ్ముతున్నారు, ఈ అవకాశవాదినే పెద్ద దిక్కుగా భావిస్తున్నారని అని చంద్రబాబు  బాకా మీడియా చెబితే మాత్రం నమ్మేసేందుకు జనాలు చెవుల్లో పూలు పెట్టుకుని కనిపిస్తూ ఉన్నారా? అనే సందేహం రానే వస్తుంది.

పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇలా చంద్రబాబు  బాకా మీడియా ఆయన తరఫున డప్పు వేయడం అయితే ఆపడం లేదు. ఫలితాలు వస్తే.. అప్పుడు ఎవరి బలం ఏమిటో తేలిపోతే కానీ.. ఈ డబ్బా కొట్టే పనులు ఆగవేమో!