cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

రోడ్లు వేసి, మొక్కలు నాటితే రాజధాని అయిపోదు

రోడ్లు వేసి, మొక్కలు నాటితే రాజధాని అయిపోదు

-విఎస్‌ఎన్‌ మూర్తి

టిడిపియే కాదు, వైసిపి కూడా యీ సత్యం గుర్తించాలి

నమస్కారం పివిపి గారు.. మొత్తానికి అనుకున్నది సాధించారు.
అప్పుడే ఎక్కడ, మే నెలాఖరున తేలే వ్యవ్యహారం కదా? దేవుడు కష్టపడిమని చెప్పాడు. కష్టపడదాం.

అదిసరే. కనీసం పోటీకి దిగాలన్న కోరిక నెరవేరుతోంది కదా?
దానికయితే ఓకె.

అసలు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అయిదేళ్ల ముందు నుంచి ప్లాన్‌ చేసుకుంటూ వస్తారు. మీడియాలో వుండేలా చూసుకుంటారు. ఇంకా.. ఇంకా. కానీ మీరు అయిదేళ్లుగా సైలంట్‌గా వున్నారు. ఇప్పుడిది ఎలా సాధ్యం.
మనం అప్పుడేదో ట్రయ్‌ చేసాం. కాలేదు. వదిలేసాం. వేరెవరో భుజానికి ఎత్తుకున్నారు. అదంతా మనకు అనవసరం. మనం రిలాక్స్‌డ్‌గా వున్నాం. ఇక దీర్ఘకాలిక ప్రణాళిక అంటారా? రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోయినా సర్వీస్‌ సెక్టార్‌లో యాక్టివ్‌గానే వున్నాను. 2000లో ఇంజనీరింగ్‌ కాలేజీ కట్టాం. ఎంతోమంది విద్యార్థులకు సాయం అందించాం. పివిపి మాల్‌ కట్టాను అంటే అది వ్యాపార దృక్పథంతో చేసిందికాదు. నేను పుట్టిన ప్రాంతానికి ఓ ఐకానిక్‌ సింబల్‌ వుండాలి అన్నది ఆలోచన. అదృష్టం కొద్ది ఇప్పటికే విజయవాడకు అదే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌. ఆ రోజుల్లో బెజవాడకు సచిన్‌ను తీసుకువచ్చాను. విజయవాడలో ఎంతోమందికి ఏన్నో చేసాం. మా టీచర్లకు ఫంక్షన్‌ జరిపి ఒక్కో టీచర్‌కు వన్‌ లాక్‌ గోల్డ్‌ అందించాం. ఇవన్నీ నా కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటూ వెళ్లా అంతే. ఇలాంటివి ప్రచారం చేసుకోకూడదు.

మరి మీమీద మీడియా దృష్టి ఎందుకు పడలేదు ఈ యాంగిల్‌లో?
ఒకటండీ. నేను రూపాయి ఖర్చుచేసి వంద రూపాయల ప్రచారం కావాలని ఎనాడూ కోరుకోలేదు. కర్మసిద్దాంతాన్ని నమ్ముతాను. నలుగురికి మంచిచేస్తే, మనకి మంచి జరుగుతుందని నమ్ముతాను. విజయవాడలో ఎంతోమందికి ఎంప్లాయిమెంట్‌ క్రియేట్‌ చేసాను. ఇంకా అబ్రాడ్‌లో కూడా. నేను క్రియేట్‌ చేసినంత ఎవ్వరూ చేయలేదు. నేను విజయవాడలో మాంచి మాల్‌ కట్టి, సచిన్‌ను తీసుకొచ్చి, గుర్తింపు తెచ్చేనాటికి నాకు రాజకీయాల ఆలోచనే లేదు. మరి ప్రభుత్వం గత అయిదేళ్లలో ఏం చేసింది బెజవాడకు?

ఓ మధ్యతరగతి వ్యక్తిగా విజయవాడ నుంచి బయలుదేరి ప్రపంచం తిరిగి, మళ్లీ విజయవాడకు ఓ పొలిటీషియన్‌గా వస్తున్నారు. ఎలా వుంది?
ఇవన్నీ జీవితంలో ఎదురయ్యే, సాధించాల్సిన డిఫరెంట్‌ ఛాలెంజెస్‌. విజయవాడ వదిలాను. ఆస్ట్రేలియా వెళ్లాను. అమెరికా వెళ్లాను. ఇండియా వచ్చాను. ఇలా ఒక్కో టైమ్‌లో ఒక్కో ఛాలెంజ్‌. ఇప్పుడు రాజకీయాలు. కానీ నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ మారలేదు. ఏ విషయం టేకప్‌ చేసినా పెర్‌ ఫెక్షన్‌ వుండాలి. నాతో ట్రావెల్‌ చేసిన వారిని ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. మాట ఇస్తే వెనక్కు వెళ్లడు అనే.

విజయవాడ అంటేనే సమైక్యాంద్ర పుట్టక ముందు నుంచీ కూడా రాజకీయాలకు కేంద్రం. అలాంటి విజయవాడ రాజకీయాలను మీరు తట్టుకుని, నెగ్గుకుని రాగలరా? పైగా మీరు అంతా సిస్టమేటింగ్‌ వుండాలి అంతా అంటారు. మీ స్వభావం రాజకీయాలకు సూట్‌ అవుతుందా?
సూట్‌ కాదని నాకు తెలుసు. కానీ సమ్‌ బడీ..సమ్‌ వేర్‌ స్టార్ట్‌ చేయాలి. ఎవరో ఒకరు చేయాలి. నా నమ్మకం ఏమిటంటే, ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించకుండా, రూపాయి ఆర్జించకుండా, మనంతట మనం చేసి చూపిస్తే, జనం కచ్చితంగా ఆదరిస్తారు అన్నది. ఆ మార్పు నా స్వంత ఊళ్లో, నా నుంచి స్టార్ట్‌ అయితే నాకు ఆనందమే కదా. మాటల్లో కాదు, కామన్‌ మాన్‌ డెవలప్‌ మెంట్‌ కు చేతల్లో ఎంతోకొంత చూపించాలి అన్నది నా కోరిక. బ్రతికేదే తక్కువ కాలం. ప్రతి నిమషం మంచి విషయాల మీద దృష్టి పెట్టకుండా, వాళ్లని తిడతాం. వీళ్లను తిడతాం అంటూ గడిపేస్తే ఎలా? నా ఫోకస్‌ అంతా తరువాత తరం మీద. వాళ్లకు ఎంప్లాయ్‌ మెంట్‌ జనరేట్‌ చేయాలి. వాళ్లని పూర్తిగా గైడ్‌ చేయాలి. మోటివేట్‌ చేయాలి. ఆ రోజుల్లోనే సచిన్‌ ను విజయవాడ తీసుకువచ్చాను. దేశంలో ఎంతో మందితో రిలేషన్‌ వుంది. ఎవర్ని అయినా తీసుకువచ్చి, యూత్‌ ను మోటీవేట్‌ చేయించగలను. ఏ కంపెనీలను అయినా రప్పించగలను. అవకాశాలు ఇప్పించగలను.

విజయవాడ ఆల్రెడీ క్యాపిటల్‌ కదా. ఇంక డెవలప్‌మెంట్‌ ఆటోమెటిక్‌గా వస్తుంది కదా?
మీమాట నిజమైతే మరి గత అయిదేళ్లలో ఏం డెవలప్‌మెంట్‌ వచ్చింది చెప్పండి. ఎందువల్ల అంటారు? రోడ్లు వేసి, మొక్కలు పాతేస్తే క్యాపిటల్‌ అయిపోదు. సోషల్‌ ఇన్‌ ఫాస్ట్రక్చర్‌ కలిగించాలి. కాస్మాపాలిటన్‌ కల్చర్‌ తీసుకురావాలి. ఎవరైనా రాగలగాలి. ఎవర్ని అయినా స్వీకరించగలగాలి. అలాంటి వాతావరణం కలుగచేయాలి. కొన్ని ఇంటర్నేషనల్‌, నేషనల్‌ సంస్థలు వస్తే, మెల్లగా ఆ వాతావరణం అలవాటు అవుతుంది. అన్ని ప్రాంతాల జనాలకు వెల్‌కమింగ్‌గా వుండాలి. ఇవన్నీ ఫోకస్డ్‌గా చేసుకుంటూ వెళ్లాలి. విజయవాడ జనాలను అక్కడే వుండిపోమనకూడదు. ప్రపంచాన్ని చూసి రమ్మనాలి.

రాజకీయాలపై ఆసక్తి వున్నవాళ్లు ఏదో పదవికి పోటీచేయాలి అనుకుంటారు. లేదా ఏది దొరికితే దానికి. కానీ మీరెందుకు ఎంపీ తప్ప మరేదీ వద్దు అని అనుకుంటారు.
ఎంతకాదన్నా, ఈ దేశానికి దిశానిర్దేశం చేసేది పార్లమెంట్‌. ఒకప్పుడు పార్లమెంట్‌లో ఎంత నిబద్ధత కలిగిన ప్రజాప్రతినిధులు వుండేవారు? తొలితరం పార్లమెంటేరియన్స్‌ దేశం పట్ల ఎంత నిబద్దత వుండేదా? ఇప్పుడేరి? ఎంతమంది వున్నారు. అసలు మన భావాలాను సరిగ్గా కమ్యూనికేట్‌ చేయగలిగిన వారు ఎంతమంది వున్నారు. స్పేషల్‌ స్టేటస్‌ మీద అక్కడ మాట్లాడగలిగిన వాళ్లు మహా అయితే ఇద్దరు.

కానీ మీ ఒక్కరి వల్ల అక్కడ అంతా మారిపోదు కదా?
మారదు. కానీ ప్రయత్నం చేయాలి కదా? నాకు కమ్యూనికేషన్‌ సమస్యలేదు. మరే విధమైన సమస్యలు లేవు. అందుకే అక్కడ మనగొంతు బలంగా వినిపించగలనన్న నమ్మకం వుంది. పార్లమెంట్‌లో జరిగే లా మేకింగ్‌ ప్రాసెస్‌లో నా వంతు భాగం వుండాలని నా కోరిక. నేను ప్రభావం చూపించలేకపోవచ్చు. కానీ ప్రభావం చూపే ప్రయత్నం చేయగలను. మన రాష్ట్ర పార్లమెంటేరియన్లు కమ్యూనికేట్‌ చేసే తీరుచూసి నాకు బాధేస్తుంటుంది. ఇంతకన్నా బాగా చెప్పలేమా? అనిపిస్తూంటుంది.

ఒకప్పుడు రాజకీయాల కారణంగా మీ వ్యాపారాలు ఇబ్బందుల్లో పడ్డాయి. కానీ మీరు దాదాపు క్లీన్‌ చిట్‌తో బయటపడ్డారు. మళ్లీ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. మళ్లీ ఏమైనా?
కొత్తగా ఇంకా ఏం మిగిలింది. ఇడి, సిబిఐ ఇలా అందరూ నా చరిత్ర తవ్వితీసారు. ఇంక తవ్వడానికి అక్కడేమీలేదు. వాళ్లే క్లీన్‌చిట్‌ ఇచ్చాక ఇంకేమిటి? నేను ఏ బ్యాంక్‌ను దోచుకోలేదు. ఏ ప్రభుత్వం నుంచి అంగుళం ల్యాండ్‌ తీసుకోలేదు. గత అయిదేళ్లలో ఆంధ్రలో అంగుళం భూమి కొనుగోలు చేయలేదు. గవర్నమెంట్‌తో ఇన్‌వాల్వ్‌ మెంట్‌ వుండే ఏ బిజినెస్‌లోకి నేను దిగమన్నా దిగను. ఎందుకంటే నన్ను ఎవ్వరూ క్వశ్చను చేయకూడదు. ఆ అవకాశం ఇవ్వకూడదు. ఇంకేం చేస్తారు?

మీకు అన్ని రాజకీయ పక్షాల్లోనూ మంచి సన్నిహిత మిత్రులు వున్నారు. మీరు ఇప్పుడు ఓ పార్టీలోకి వెళ్లిపోతే, మీ స్నేహాలు?
సింపుల్‌ ఆన్సర్‌ అండీ. ప్రతి రాజకీయ నాయకుడు అయినా, ఏ పార్టీ అయినా మోటో ఏంటీ? సేవ అనేదే కదా? వాళ్లు అక్కడ వుండి సేవచేస్తారు. నేను ఇక్కడ వుండి సేవచేస్తాను అంతే.

రాజకీయాలు అంటే వ్యక్తిగత దూషణలకు, బురద జల్లుడు రాజకీయాలకు పెట్టింది పేరుగా మారిపోయింది. మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ పరిస్థితిని?
విమర్శిస్తే, అది సహేతుకమైతే స్వీకరిస్తా. అవసరం అయితే మార్చుకుంటా. నేను ఒకళ్లని ఓ మాట అనను. అలాకాకుండా నన్ను డిఫేమ్‌ చేద్దామనుకున్నా, లేదూ, బురద జల్లుదాం అనిచూస్తే, నూరేళ్లు కోర్టుల చుట్టూ తిప్పిస్తా. మామూలు రాజకీయనాయకుల వ్యవహారం కాదు నాతో. బురదవేసాం. కడుక్కో అంటే కుదరదు. కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాల్సిందే.

లోకల్‌ పార్టీ కేడర్‌ అంతా మీకు సహకరిస్తారని అనుకుంటున్నారా?
అందరితో నేను చిరకాలంగా టచ్‌లోనే వున్నాను. అందరికీ అవసరం అయిన సాయం చేస్తూనే వున్నాను. సో సహకారానికి లోపం వుండదు.

రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఇక సినిమాలు వదిలేస్తారా?
లేదు. సినిమాలు నా సరదా. అవి అలా కొనసాగుతూనే వుంటాయి.

సరదాగా? చివరగా ఓ సిల్లీ క్వశ్చను... ఒకప్పటి మీ మిత్రుడు పవన్‌కళ్యాణ్‌ మీ మీద పోటీచేస్తే..?
ఎవరు చేసినా, సర్వీస్‌ మోటోతోనే కదా? మీరు సిల్లీ క్వశ్చను అనేసారు. అందువల్ల చేయరనే అనుకుందాం.

థాంక్యూ.. బెస్టాఫ్‌ లక్‌ అండీ
థాంక్యూ

 వైయస్‌ పాలించినది వైసిపి పార్టీ అధినేతగా కాదు