cloudfront

Advertisement


Home > Politics - Political News

ఐశ్వర్యరాయ్ మాజీ ప్రియులు ఏకం అవుతున్నారా?

ఐశ్వర్యరాయ్ మాజీ ప్రియులు ఏకం అవుతున్నారా?

ఒకదశలో సల్మాన్ ఖాన్ మీద ఫైర్ అయిన వ్యక్తి వివేక్ ఒబెరాయ్. సల్మాన్- ఐశ్వర్యల బ్రేకప్ వ్యవహారం, అదే సమయంలో సల్మాన్ కేసుల్లో చిక్కుకోవడం.. వంటి పరిణామాలను వివేక్ ఒబెరాయ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడని అంటారు. వివేక్ ఒబెరాయ్ తండ్రి సురేష్ ఒబెరాయ్ నటుడు, అంతేకాదు.. వ్యాపారవేత్త కూడా! అలాంటి బిగ్ షాట్ కొడుకు కావడంతో అప్పటికి బాలీవుడ్ లో అంతగా గుర్తింపు లేకపోయినా వివేక్ కు ఐశ్వర్య దగ్గరైందని అంటారు.

ఇక తనతో బ్రేకప్ అనంతరం ఐశ్వర్య వెళ్లి వివేక్ కు దగ్గర కావడం కూడా సల్మాన్ కు నచ్చలేదని.. దీంతో పలుసార్లు అతడికి కాల్స్ కూడా చేశాడని అంటారు. ఈ విషయాన్ని అయితే వివేక్ ఒబెరాయ్ స్వయంగా చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టి సల్మాన్ ను కడిగేశాడు అప్పట్లో. ఒకేరాత్రి తనకు సల్మాన్ ఖాన్ నలభై ఒక్కసార్లు బెదిరింపు కాల్స్ చేశాడని, తనను చంపేస్తానంటూ సల్మాన్ హెచ్చరిస్తున్నాడంటూ అప్పట్లో వివేక్ ఒబెరాయ్ ప్రెస్ మీట్ పెట్టి వాపోయాడు.

చివరకు ఆ వ్యవహారంలో సల్మాన్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కొన్నాళ్ల పాటు వివేక్ ఒబెరాయ్ – ఐశ్వర్యరాయ్ లు ఎంచక్కా కలిసి తిరిగారు. నాలుగైదేళ్ల పాటు ప్రేమలో విహరించారు. చివరకు ఐశ్వర్య వివేక్ కు కూడా దూరం అయ్యింది. అభిషేక్ బచ్చన్ కు దగ్గరై అతడినే పెళ్లి చేసుకుని సెటిలైంది!

అటు సల్మాన్ కు, వివేక్ ఒబెరాయ్ కు దక్కలేదు ఐశ్వర్య. అయితే  వారిద్దరి మధ్య దూరం అయితే అలాగే కొనసాగింది. పదిహేడేళ్లుగా వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదట. ఆ విషయాన్ని వివేక్ ఒబెరాయ్ చెబుతున్నాడు. సల్మాన్ ఖాన్ తనను క్షమించాలన్నట్టుగా వివేక్ అర్థిస్తూ ఉన్నాడు!

మరి ఇన్నేళ్ల తర్వాత ఐశ్వర్య  మాజీ ప్రియులు సన్నిహితులుగా మారతారా? వీరిద్దరి స్నేహం ఐశ్వర్యకు ఇప్పుడు తలపోటుగా మారదా?

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది