cloudfront

Advertisement


Home > Politics - Political News

సుస్థిర ప్రభుత్వమా? గందరగోళ రాజకీయమా?!

సుస్థిర ప్రభుత్వమా? గందరగోళ రాజకీయమా?!

దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్‌ ప్రక్రియ ముగిసినట్టే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు కలిగిన వారందరూ తమ ప్రాథమిక హక్కును వినియోగించుకునే అవకాశం ఇది. ఈ ప్రక్రియలో మెజారిటీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ పర్సెంటేజ్‌ పెరుగుతూ వచ్చింది. ప్రతి దశలోనూ గత పర్యాయంతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరిగింది.

రెండు మూడుశాతం పోలింగ్‌ పర్సెంటేజ్‌ పెరిగినా ఓవరాల్‌గా కొన్ని కోట్ల మంది అదనంగా ఓటు హక్కును వినియోగించుకున్నట్టే. వందశాతం పోలింగ్‌ పర్సెంటేజ్‌ను ఆశించలేం ఇంత పెద్దదేశంలో. అందులోనూ ఓటర్ల జాబితాలో లోటుపాట్లు ఉండనే ఉంటాయి. భౌతికంగా లేని కొంతమంది పేర్లు జాబితాల్లో ఉండటం, రిపీటెడ్‌గా కొన్ని పేర్లు ఉండటం.. వంటి కారణాలతో కొంతశాతం ఓటు పోలింగ్‌ పర్సెంటేజ్‌ తగ్గుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

స్థూలంగా కొన్ని సమస్యలు ఎదురయినప్పటికీ పోలింగ్‌ ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్టే. ఈ ప్రక్రియపై బురద జల్లేందుకు కొందరు రాజకీయనేతలు తీవ్రంగా ప్రయత్నించారు. వారు ఈవీఎంలను శంకించారు. తమ ఓటు తమకే పడలేదని చెప్పుకొచ్చారు. అలాంటి ఫిర్యాదులు ప్రజల నుంచి రాలేదు!

దేశంలో ఏ ఒక్క సామాన్యుడు కూడా తనువేసిన ఓటు తను ఎంచుకున్న పార్టీకి కాకుండా వేరే పార్టీకి పడిందిని ముందుకురాలేదు. అలా మాట్లాడినవారు ఎవరైనా ఉంటే అది రాజకీయ నేతలు మాత్రమే! తాము గెలిస్తే ఈవీఎంలు మంచివని, తాము ఓడిపోతే తప్పంతా ఈవీఎంలదే అంటూ మాట్లాడుతున్న నేతలను అలా వదిలేయడమే. వారిని అంతకన్నా పట్టించుకోవడానికి లేదు!

పోలింగ్‌ ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు అలాంటి వారిని పట్టించుకునే మూడ్‌లో లేరు. వారు ఫలితాల గురించి ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వారంలోనే అందుకు సంబంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించబోతూ ఉంది.

ఇలాంటి నేపథ్యంలో కోరుకోదగినది ఒక్కటే. సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి అనేది. ఇటు ఏపీలో అయినా, అటు కేంద్రంలో అయినా గందరగోళ రాజకీయాలు లేకుండా.. సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని.. రాష్ట్రం, దేశం ప్రగతి పథంలో పురోగమించాలని ఆకాంక్షిద్దాం.

-ఎల్‌.విజయలక్ష్మి

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం..