cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

తనయుడిపై చంద్రబాబుకి ఎంత నమ్మకమో.!

తనయుడిపై చంద్రబాబుకి ఎంత నమ్మకమో.!

'నో డౌట్‌.. తెలంగాణ ఎన్నికల్లో నారా లోకేష్‌తో ప్రచారం చేయిస్తే అంతే సంగతులు..' అనే ఖచ్చితమైన అభిప్రాయంతోనే తన పుత్రరత్నాన్ని కాస్త దూరంగా వుంచారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకూ.! తప్పదు, నారా లోకేష్‌గారి పాండిత్యం ఆ స్థాయిలో వుంటుంది మరి. పొరపాటు, 'టీడీపీని గెలిపించండి..' అనడానికి బదులు, 'టీడీపీని ఓడించండి' అనేసినా అనేస్తాడు. అదే లోకేష్‌ ప్రత్యేకత. 

టీడీపీని దేశంలోనే అత్యంత అవినీతి పార్టీగా ఇదే నారా లోకేష్‌ ఓ సందర్భంలో అభివర్ణించారు. ఒక్కసారి అయితే పొరపాటు.. ఒకటికి రెండు సార్లు ఇవే తరహా పొరపాట్లు జరుగుతోంటే, ప్రత్యర్థులకు ఛాన్స్‌ ఇచ్చేసినట్లే కదా.! తనయుడు నారా లోకేష్‌ మాటని ఎలాగూ కంట్రోల్‌ చేయలేరు గనుక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నుంచి పూర్తిగా అతన్ని దూరం పెట్టేయాల్సి వచ్చింది చంద్రబాబుకి. 

ఇదే అంశమై, వైఎస్సార్సీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో అన్నీ తానే అయి, టీడీపీకి డిపాజిట్లు రాకుండా మట్టికరిపించిన అపర మేధావి చిట్టినాయుడు ఏమైపోయాడు.?' అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, విజయసాయిరెడ్డిపై టీడీపీ శ్రేణుల ఎదురుదాడి కూడా అదే స్థాయిలో వుందనుకోండి.. అది వేరే విషయం. 

జూనియర్‌ ఎన్టీఆర్‌ని ప్రచారంలోకి దించేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.. తన కుమారుడు కాస్త ఉత్సాహం ప్రదర్శించినా, చంద్రబాబు రానివ్వలేదు. చిత్రమైన పరిస్థితి కదూ చంద్రబాబుది.!