cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ కు పేమెంట్ పెంచినట్టున్నారు

పవన్ కు పేమెంట్ పెంచినట్టున్నారు

తెరవెనక టీడీపీతో ఒప్పందం కుదుర్చుకొని, బయటకొచ్చి జగన్ పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. పవన్ అవసరానికి మించి పిచ్చిపిచ్చిగా డైలాగులు మారుస్తున్నారని ఎద్దేవా చేసిన విజయసాయి, పవన్ కు కాస్త స్క్రిప్ట్ మార్చుకోమని సూచించారు.

"స్క్రిప్టు కాస్త మార్చండయ్యా. ఇద్దరూ అక్షరం పొల్లుపోకుండా మాట్లాడుతుంటే పచ్చ మీడియా చూపించడానికి ఇబ్బంది పడుతోంది. ఒక్కరు మాట్లాడింది చూపించి ఇద్దరి పేర్లు పెడుతున్నారు. అవసరానికి మించి పిచ్చపిచ్చగా డైలాగులు కొడుతున్నాడు ప్యాకేజీ హీరో."

ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పవన్ కు చంద్రబాబు పేమెంట్ పెంచినట్టున్నారని, అందుకే నోటికి ఇష్టమొచ్చినట్టు పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు విజయసాయి. ఏప్రిల్ 11 వరకు ఇవన్నీ భరించక తప్పదని, ఆ తర్వాత వీళ్లంతా ఎలాగూ సైలెంట్ అవుతారని అన్నారు విజయసాయి.

"పేమెంటు బాగా పెంచినట్టున్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ తెగరెచ్చిపోతున్నారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీయ సమిధలుగా చేసి మాట్లాడుతున్నారు. కాసింత కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలేస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు భరించతప్పదేమో."

పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రజలంతా పచ్చ పత్రికల్ని, ఛానెళ్లను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు విజయసాయి. చంద్రబాబును ఎలాగోలా గట్టెక్కించడానికి ఎల్లో మీడియా తెగ కష్టపడుతోందని, వివేక హత్యకేసులో జగన్ అనుచరుడు అరెస్ట్ అంటూ బాబు అను"కుల" మీడియా రాయడం విలువల పతనానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. 

అప్నా టైం ఆయేగా సాబ్ 

చెట్టు పేరుతో ఓట్లు అడుక్కోవడం.. ఎన్నాళ్లిలా