cloudfront

Advertisement


Home > Politics - Political News

జగన్ ఆ తప్పు ఎన్నటికీ చేయడు

జగన్ ఆ తప్పు ఎన్నటికీ చేయడు

కేంద్రంలో బీజేపీ సొంత బలంతో అధికారంలోకి రాకపోతే.. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే అవసరం కచ్చితంగా ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ కూడా పోటాపోటీగా స్థానాలు గెల్చుకున్నా.. మోదీ-షా మంత్రాంగం ముందు రాహుల్ ఆటలు చెల్లవు. సో.. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరికీ బలాబలాలు సమానమైనా.. కూటమితో అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఎన్డీఏకే ఎక్కువగా ఉంది.

ఇలాంటి కీలకమైన సమయంలో జగన్ అడుగులు ఎటువైపు పడతాయనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటే, బీజేపీకి జగన్ మద్దతిచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో అనివార్యంగా కేంద్రమంత్రి పదవులు ఊరించవచ్చు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ అభ్యర్థులెవరనే విషయం కూడా తేల్చేస్తున్నారు కొంతమంది మహానుభావులు.

అయితే కేంద్రంలో బీజేపీ కూటమితో పొత్తులో భాగంగా మంత్రివర్గంలో చేరే పిచ్చి పనిమాత్రం జగన్ ఎప్పటికీ చేయరని ఆయన అంతరంగం బాగా తెలిసినవాళ్లు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసమే జగన్ బీజేపీతో చేతులు కలుపుతారు, దానికోసమే బయటి నుంచి మద్దతిచ్చే ఆలోచన చేస్తారు. జగన్ నిర్ణయం వెనక ఓ బలమైన కారణం ఉంది.

మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా మైనార్టీలు ఏకపక్షంగా ఏపీలో వైసీపీకి మద్దతు తెలిపారు. కాశ్మీర్ నుంచి ముస్లిం లీడర్లను తెచ్చుకుని ఏపీలో ప్రచారం చేయించుకున్న చంద్రబాబుని ఆ వర్గం ప్రజలు నమ్మలేదు. రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ ఓటు వైసీపీకి గట్టి మద్దతుగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహంలేదు. అలాంటి వర్గాన్ని కేంద్ర మంత్రి పదవుల కోసం జగన్ దూరం చేసుకోరు.

బీజేపీతో బంధాన్ని కేవలం ప్రత్యేకహోదా కోసం మాత్రమే వాడుకోబోతున్నారు జగన్. అది కూడా రాష్ట్రమంతటికీ ప్రయోజనకరంగా ఉండే అంశం కాబట్టి మాత్రమే. కాంగ్రెస్ కూటమి లేదా థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే పరిస్థితులను అంచనా వేయలేం కానీ, బీజేపీ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పడి, దానికి వైసీపీ మద్దతు తెలిపితే మాత్రం ఆ పార్టీ పదవులను ఆశించకపోవచ్చు.

కేవలం స్పెషల్ స్టేటస్ ను మాత్రమే డిమాండ్ చేసి మరీ తీసుకుంటుంది. మంత్రి పదవులు ఆశించి, మైనార్టీలను దూరం చేసుకునే తప్పు జగన్ ఎప్పటికీ చేయరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సెక్స్ కు మనిషిని దూరం చేస్తున్న ఇంటర్నెట్!