ఎమ్బీయస్ – గ్రేట్ ఆంధ్రా ఆర్కయివ్స్ 2014 క్యూ 2

నా పాత ఆర్టికల్స్ వెతికేవారి సౌలభ్యం కోసం యీ బ్లాగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2009 నుంచి ఇప్పటిదాకా 12 సంవత్సరాల ఆర్టికల్స్‌కు ఏడాదికి 4 యూనికోడ్, 4 పిడిఎఫ్ చొప్పున ఫైళ్లు ఈ బ్లాగ్‌లో దొరుకుతాయి. 2009 ఉందనుకోండి. జనవరి నుంచి మార్చి Q1, ఏప్రిల్ నుంచి జూన్ Q2.. అలాగన్నమాట. ఫైలు మొదట్లో ఆ క్వార్టర్‌లో రాసిన ఆర్టికల్స్ జాబితా వుంటుంది. అది చూస్తే మీకు కావలసిన వ్యాసం దానిలో వుందో లేదో తెలిసిపోతుంది. యూనికోడ్‌ ఫైల్లో సెర్చింగ్ యీజీ. కానీ ప్రింట్ తీస్తే అందంగా రాదు. అందువలన ఇదే ఫైల్‌ను అను7లోకి మార్చి, పిడిఎఫ్ కూడా లభ్యం చేశామన్నమాట.

నేను 2015 మధ్యలో భగవద్గీతపై ఆర్టికల్ రాశానని, అది మళ్లీ చదివితే బాగుంటుందని తోచిందనుకోండి. ఆ ఏడాది క్యూ2 యూనికోడ్ ఫైళ్లలోకి వెళ్లి, వర్డ్ ఫైల్ కాబట్టి ‘ఫైండ్’ ఆప్షన్ ఎంచుకుని అక్కడ భగవద్గీత అని తెలుగులో టైపు చేస్తే (తెలుగులో టైప్ చేయడానికి జీమెయిల్‌లో కుడివైపు పైన ఇన్‌పుట్ టూల్స్ (పెన్ను బొమ్మ)లో తెలుగు ఎంచుకోవచ్చు. మెయిల్ కంపోజ్ చేస్తున్నట్లుగా టైపు కొట్టి దాన్ని కాపీ చేసి యిక్కడ పేస్ట్ చేయవచ్చు) ఆ ఫైల్ మొత్తంలో ఆ మాట ఎక్కడెక్కడుందో అదే కనిపెట్టి చూపించేస్తుంది. మీరు చదివాక నచ్చి, ప్రింట్ఔట్ తీసుకుందా మనుకుంటే పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి, కావలసిన పేజీ మాత్రం అచ్చు తీసుకోవచ్చు. ఉజ్జాయింపుగా అనుకున్న పీరియడ్ తప్పితే అదే ఏడాది క్యూ3 , పక్క ఏడాది క్యూ1… యిలా కాస్త వెతుక్కోవాలి.

దీనిలోని ఆర్టికల్స్ విషయసూచిక

క్రిమియాకోసం రష్యా పట్టుదల ఎందుకు? వహీదా రహమాన్‌ – కాస్ట్యూమ్స్‌, చలో పాలిటిక్స్‌, బెంగాల్‌ సిపిఎంలో నిరసన గళానికి ఉద్వాసన, మహారాష్ట్రలో టోల్‌ గేట్ల వ్యవహారం, సమైక్యపార్టీ అవసరం వుందా? తేజ్‌పాల్‌ కేసు నేర్పే పాఠం, బంగారం స్మగ్లింగ్‌, మరో మహాకూటమి ప్రయోగమా? కోస్తా వాళ్లకు సెంటిమెంట్లు వుండవా? ఫ్రాన్సు స్కూళ్లలో పందిమాంసం తప్పనిసరి, జశ్వంత్‌ సింగ్‌ బహిష్కరణకు కారణం…పాకిస్తాన్‌ పోలీసులూ యింతేనా? ట్రైవ్యాలీ నిందితురాలి ఆదాయంలో 90% భారతీయుల నుండే! ఎన్నికల బరిలో కళాకారులు, హాలీవుడ్‌ నటుడు మిక్కీ రూనీ మరణం, వికె మూర్తి కెమెరా విన్యాసం, తెలుగుల పాలిటి శివసేన – తెరాస, పొత్తుల వెనుక ఎత్తుపైయెత్తులు, ఔషధ రంగంలో రాబోయేది సంకటకాలమే, దక్షిణభారతంపై బిజెపి కన్ను, కోర్టు దృష్టికి వచ్చిన సరితా నాయర్‌ చీరలు, ఒడిశాలో నవీన్‌ అవకాశాలు, 1962 ఇండో చైనా యుద్ధం, తెలుగుజాతికి అవమానమా..?

..టిడిపి గ్రాఫ్‌ పెరుగుతోందా? మధ్యప్రదేశ్‌లో బిజెపి పరిస్థితి, యుపిలో అమిత్‌ షా కృషి, బిహార్‌లో అందరి నోటా బిసి మంత్రమే, అళగిరి బలమెంత? తెలంగాణలో బలాబలాలు, రాజకీయాల్లో పౌండ్రక వాసుదేవులు, గోవా రాజకీయాల్లో చర్చి పాత్ర, సొంత యింట్లో ఆజాద్‌ ఏం చేస్తున్నట్లు? నితిన్‌ గడ్కరీ సాహసం, జయప్రద పార్టీ సంగతేమిటి? శివసేన గెలిచేవెన్ని? ఎన్నికల బొమ్మల లాంతరు, తూర్పు తిరిగి దణ్ణం పెట్టమన్న మోదీ, ఆంధ్రలో బలాబలాలు, నిజాంకు మహర్దశ, విభజన ఎవరికి లాభించింది? మోదీ – ముస్లిములు, సర్వేలూ, ఒపీనియన్‌ పోల్సూ, మోదీ ప్రభంజనం, మన్‌మోహన్‌ వైఫల్యం, పాకిస్తాన్‌-తాలిబన్‌ లింకు, ఏ మేరే వతన్‌కే లోగోం – నెహ్రూ స్పందన

ఎన్నికల ఫలితాలు, ఆంధ్ర రాజధాని, ఫిరాయింపుల చేదుమాత్ర, సత్తా చాలని దత్తాత్రేయ, తెలంగాణ చిహ్నంలో చార్మినార్‌, ఋణమాఫీ జరిగేనా? డ్యామ్‌ గురించి రెండు రాష్ట్రాల రచ్చ, బెంగాల్‌లో మొద్దు శీను లాటి కథ, భగత్‌ సింగ్‌పై మరో పుస్తకం, పద్మనాభుని గుడి నుంచి రాజవంశానికి ఉద్వాసన, ఎన్నికల ఫలితాలు 2, అవశేష ఆంధ్రప్రదేశ్‌ అవతరించిందా? జాతీయ భద్రతా సలహాదారుగా ఒక ఉద్దండుడు, ఐటీ ఉద్యోగులు – కార్మిక చట్టాలు, ఈ కామర్స్‌లో అగ్రస్థానం బన్సాల్‌ అగ్రవాల్స్‌దే, రాహుల్‌ జోకరా? పంచపాండవులంటే మంచంకోళ్లలా.. మోదీకి మద్దతుగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు , ‘మనిషిలా చూస్తే చాలు..’ సారీ, గుజరాతీ.. ఆ మాట – జైరాం నోట!!?!! డి-కంపెనీకి డి-డే? శారదా చిట్‌ఫండ్‌ బాధితుల గోడు, అక్కడ రాహుల్‌ – ఇక్కడ స్టాలిన్‌, మోదీ టీము, భార్యాభర్తలా? అన్నదమ్ములా? ప్రతిదానికీ ఆంధ్ర రంగు పూయాలా? తల్లి సెంటిమెంటు, మోదీ ప్రమోల మనిషి – మనీష్‌, మావోయిస్టు మేధావి, ప్రాణాలు తిరిగి వస్తాయా? సల్మాన్‌ కేసులో ప్రత్యక్షసాక్షులు, గోపీనాథ్‌ ముండే, కొత్తవాళ్లంటేనే మోజు, ప్రీతి జింటాకు మాజీ ప్రియుడితో తంటా

ఈ ఆర్టికల్స్‌లో సీరియల్స్ కలపలేదు. వాటిని విడిగా ఈ-బుక్స్‌గా తయారుచేద్దామని ప్లాను. అంటే బైబిల్, రాజీవ్ హత్య, తమిళ రాజకీయాలు, నిజాం కథలు, గోడ్సే, ప్రాణ్, హేమమాలిని, వినోద్ మెహతా.. యిలాటివన్న మాట. సాహిత్యాంశ వున్న కన్యాశుల్కం, మృచ్ఛకటికం, నచ్చిన కథ లాటి వాటితో యింకోటి చేయవచ్చు. ఆర్టికల్స్ ఫ్రీగా చదువుకోవచ్చు, అయితే వెతుక్కునే శ్రమ వుంటుంది. ఆ శ్రమ పడనక్కరలేకుండా చక్కగా ఫోటోలతో సహా పుస్తకాలుగా తయారుచేసి యిస్తాం కాబట్టి ఈ-బుక్స్‌ను కొనుక్కోవాలి. 1/8 డెమీ సైజులో ప్రియాంకా 15-15 ఫాంట్‌లో అచ్చు వేసిన పుస్తకాలు రూపాయికి పేజీ చొప్పున అమ్ముతున్నారు. ఈ-బుక్స్ కాబట్టి రూపాయికి 4 పేజీలిద్దామని ప్లాను. అంటే 200 పేజీల పుస్తకాన్ని 50 రూ.లు పెట్టి కొనాలన్నమాట. ఈ బుక్స్ కోసం యిదే బ్లాగ్‌లో వేరే ఆప్షన్ చూడండి. ఇది మీకు ఉపయోగకరంగా వుంటుందని ఆశ. ఇబ్బంది వుంటే తెలియపరచండి. – ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

[email protected]