Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప్రెస్‌మీట్ పెట్టడానికి జడుస్తున్న బొత్స

ప్రెస్‌మీట్ పెట్టడానికి జడుస్తున్న బొత్స

పాలనా నిర్ణయాల సామర్థ్యం, రాజకీయ అనుభవం, ప్రజాదరణ లాంటి కోణాల్లోంచి మంత్రులు కాదగిన అర్హత చాలా మందికి ఉండొచ్చు గాక.. కానీ.. మీడియా ముందు మాట్లాడే పరిస్థితి వస్తే సమర్థంగా ఎదుర్కోవడమూ.. ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతినకుండా చాకచక్యంగా సంబాళించుకురావడమూ.. మాత్రం ప్రత్యేకమైన విద్య. సబ్జెక్టు మీద అపారమైన అవగాహనతో పాటు.. కమ్యూనికేషన్ (మాట) మీద కూడా పట్టు ఉన్న వారికే అది సాధ్యమవుతుంది. అవే గనుక లేకపోతే.. ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాగా.. చికాకు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బొత్స సత్యనారాయణకు సాధారణంగా లౌక్యంగా, నర్మగర్భాలంకారం వేసి మాట్లాడడం తెలియదు. సూటిగా మాట్లాడేస్తుంటారు. కాస్త ఘాటుగా చెప్పాలంటే నోటికి ఏది వస్తే  అది మాట్లాడేస్తుంటారు. దానికి తగ్గట్లుగానే తన మాటల వల్ల తరచూ చిక్కుల్లో ఇరుక్కుంటూ ఉంటారు.

తాజాగా ఎన్డీయేలో వైకాపా చేరడానికి అవకాశం ఉన్నదంటూ చెప్పినమాటల వల్ల కూడా..  బొత్సకు ఇబ్బందులు ఎదురైనట్లుగా కనిపిస్తోంది. జగన్ ఢిల్లీ వెళ్లి మోడీని కలిసిన వెంటనే.. ఎన్డీయేలో వైకాపా చేరుతుందని, రెండు మంత్రి పదవులు తీసుకుంటారని పుకార్లు వచ్చాయి. విశాఖలో ప్రెస్ మీట్ పెట్టిన బొత్స సత్యానారాయణ, ‘‘రాష్ట్రం కోసం ఎవరి గడ్డమైనా పట్టుకుని బతిమాలుతాం.. అవకాశం వస్తే పరిశీలిస్తాం.. దానివల్ల మేలవుతుందనుకుంటే దానికేముంది...’’ తరహా మాటలతో వైకాపా చేరబోతున్నట్లుగా ధృవీకరించేశారు. దానికి సంబంధించి పార్టీలో ఆయనకు చీవాట్లు పడినట్లుగా కనిపిస్తోంది.

ఆ వెంటనే బొత్స సత్యనారాయణ నష్టనివారణ చర్యలు చేపట్టారు. ‘‘అబ్బెబ్బే నేనసలు ఆ మాటే అనలేదు’’ అంటూ మాట దిద్దుకునే ప్రయత్నం చేశారు. ‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం’ అని తాను అనలేదని వివరణ ఇచ్చారు. అయితే ఈసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం ఒక లేఖ రాసి విడుదల చేశారు. ప్రెస్ మీట్ పెడితే.. ఏం అడుగుతారో.. నోరు జారి ఏం మాట్లాడుతామో.. ఎందుకొచ్చిన గొడవలెమ్మని ఆయన జడుసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయినా లేఖ ద్వారా దిద్దుకోవడం సంగతేమో గానీ.. ఎన్డీయేలో చేరతాం అనే మాట వల్ల నష్టం ఏదైనా ఉండట్లయితే.. ఆ నష్టం ఆల్రెడీ జరిగేపోయింది.

మరో 'సామజవరగమన' వస్తుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?