గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఈ సారి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఏ సామాజికవర్గానికి చెందిన మహిళ అయినా ఈ పీఠాన్ని చేపట్టవచ్చు. కార్పొరేటర్ గా గెలిచి ఉండాలంతే.
సీట్ల బలం తగ్గినా మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ కు సానుకూల పరిస్థితే ఉంటుంది. అయితే తక్కువ బలంతో మేయర్ గా ఎన్నికైతే ఐదేళ్లూ కొన్ని ఆటుపోట్లను తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. అందుకు గానూ కాస్త రాజకీయం తెలిసిన వ్యక్తి మేయర్ కావాల్సి ఉంటుంది.
రిజర్వేషన్ జనరల్ మహిళ గా ఉన్నా.. మేయర్ పీఠం కోసం ఓసీ వర్గాల నుంచినే ఎక్కువ పోటీ కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన రెడ్డి మహిళలు మేయర్ పీఠం రేసులో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే మేయర్ అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.
భారతీ నగర్ నుంచి నెగ్గిన సింధూ ఆదర్ష్ రెడ్డి హైదరాబాద్ కు మేయర్ కాబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఆమె కేసీఆర్ తో నిన్న సమావేశం కావడంతో.. కాబోయే మేయర్ ఆమే అని ప్రచారం జరుగుతూ ఉంది.
ఇంకా మేయర్ పీఠం ఆశావహుల్లో..మన్నె కవితారెడ్డి, విజయశాంతి రెడ్డి, కేశవరావు కూతురు విజయలక్ష్మి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి తదితరులు ఉన్నారట. అయితే అవకాశం మాత్రం సింధూ ఆదర్ష్ రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం జరుగుతూ ఉంది.
ఇది వరకూ కాంగ్రెస్ తరఫు నుంచి బండ కార్తికారెడ్డి హైదరాబాద్ మేయర్ గా ఎన్నికయ్యారు. హైదరాబాద్ కు తొలి మహిళా మేయర్ గా నిలిచారామె. ఇప్పుడు మరోసారి మహిళా మేయర్ ఎన్నికవుతున్నారు.
చంద్రబాబు మీద కోపంతో అమూల్‌ను తేలేదు