మారుతి.. ప్రభాస్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా రాజా సాబ్. ఆరంభంలో ఈ సినిమాలు చాలా చిన్నగా చూసారు అందరూ, ఫ్యాన్స్ తో సహా. కానీ రాను రాను సీన్ మారింది. ఈ సినిమా మీద ఆసక్తి పెరుగుతూ వస్తోంది.
ఎందుకంటే ప్రభాస్ ను ఇలా ఫన్ జానర్ లో చూసి చాలా కాలం అయింది. సీరియస్ యాక్షన్ సినిమాలు కాకుండా ఇలాంటి సినిమా వస్తే వేరే లెవెల్ లో వుంటుందని ఇప్పుడు భావిస్తున్నారు.
రాజాసాబ్ సినిమాలో సిజి వర్క్ కు చాలా అంటే చాలా వుంది. సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్, ఎ ఐ క్రియేషన్ కు లిమిట్ లేదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం చాలా యానిమల్స్ ను ఎఐ లో క్రియేట్ చేసారట. వాటిలో గుడ్ల గూబలు, పాములు, మొసళ్లు ఇలా చాలా వున్నాయట.
మారుతి తయారు చేసిన కథ హర్రర్ జానర్ ఎంటర్ టైనర్. మరి ఇందులో ఇలాంటి జంతువులు అన్నీ ఏమిటో? వాటితో ఏం చేయబోతున్నారో అన్న క్యూరియాసిటీ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సంజయ్ దత్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారు. మరి కొద్ది రోజుల్లో హీరో ప్రభాస్ కూడా షూట్ లో జాయిన్ అవుతారు.
కొద్ది రోజుల షూట్, పాటలు బకాయి వుంది రాజాసాబ్ సినిమాకు.
Prabhas anna movie release date appudu