టీడీపీకి ఎమ్మెల్సీ జ‌కియా షాక్‌

త‌మ‌తో సంప్ర‌దింపులు జ‌రిపి, బీజేపీ గూటికి జ‌కియా చేర‌డంపై టీడీపీ అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ , మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జాకియా ఖాన‌మ్ షాక్ ఇచ్చారు. వైసీపీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఆమె టీడీపీలో చేరుతార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రిగింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. మంత్రులు నారా లోకేశ్‌, ఫ‌రూక్ త‌దిత‌రుల‌తో ఆమె ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిపారు.

ఇక టీడీపీలో చేర‌డ‌మే ఆలస్యమని అనుకున్నారు. అందుకే మండలిలో వైసీపీ ప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌మ పార్టీతో జ‌కియాకు ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి స‌మ‌క్షంలో బీజేపీ కండువాను జ‌కియా క‌ప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. బీజేపీకి మైనార్టీలు వ్య‌తిరేకంగా ఉన్నార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో ఎమ్మెల్సీ నిర్ణ‌యం ముఖ్యంగా టీడీపీని షాక్‌కు గురి చేసింది.

అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జ‌కియా బీజేపీలో చేర‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఆశిస్తున్నారో తెలియ‌డం లేదు. ఎందుకంటే, జ‌కియా మ‌తానికి చెందిన ఏ ఒక్క‌రూ సిద్ధాంత‌రీత్యా బీజేపీకి బ‌ద్ధ వ్య‌తిరేకులు . ఈ విష‌యం తెలిసి కూడా జ‌కియా అక‌స్మాత్తుగా బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

టీడీపీలో జ‌కియా చేరుతుంద‌ని ఆమె అనుచ‌రులు అనుకున్నారు. కానీ బీజేపీలో చేర‌డంతో వాళ్లంతా తీవ్ర నిరుత్సాహానికి గుర‌య్యారు. బీజేపీలో చేర‌డానికి కార‌ణం ఏంటో ఆమె చెబితేనే తెలుస్తుంది. మ‌రోవైపు త‌మ‌తో సంప్ర‌దింపులు జ‌రిపి, బీజేపీ గూటికి జ‌కియా చేర‌డంపై టీడీపీ అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

21 Replies to “టీడీపీకి ఎమ్మెల్సీ జ‌కియా షాక్‌”

  1. ### **ప్రజల తీర్పు జగన్‌కు గుణపాఠం – ఇక ఫ్రీబీల యుగం పూర్తిగా ముగిసింది** ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి చరిత్ర సృష్టించారు. లెక్కలేనన్ని సంక్షేమ హామీలు, కోట్లాది రూపాయల పంచాయతీలు, ప్రతి ఇంటికీ ఖర్చుల వర్షం కురిపించిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు కేవలం **11 సీట్ల**తో అడ్డంగా తోసిపారేశారు. ఇది ఓ సాధారణ ఓటమి కాదు. ఇది ప్రజల చేతి గొప్ప గుణపాఠం. ఇది ‘వెలుగు’లా మారాలని వచ్చిన ప్రభుత్వం ‘చీకటి’ పాలనగా మారితే, ప్రజలు ఎలా స్పందిస్తారో చూపించిన తర్జన. జగన్ మోహన్ రెడ్డి పాలన అసలు అభివృద్ధిని మరిచి, సంక్షేమం అనే ముసుగులో మోసపూరిత రాజకీయాలకే పరిమితమైంది. పేదలకు డబ్బులు వేసితే చాలు, ఓటేసే యంత్రాలుగా మారిపోతారని ఆయన భావించారు. కానీ ప్రజలు స్పష్టంగా చెప్పారు — **“మీ మాయలో మేము మళ్లీ పడమని… మా ఓటుకు విలువ ఉందని…”** జగన్ తలుచుకున్న ఓటు బ్యాంకు అసలే ఎగిరిపోయింది. ప్రజల తీర్పు చూస్తే, జగన్ మళ్లీ సీఎం అవుతాడా అన్న సందేహమే కాదు — ఇప్పుడు **ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందో లేదోనే అనుమానం**. కార్యకర్తలే ముసిముసిగా మాట్లాడుతున్నారు — “సార్… ఇక మెజారిటీ ఏమో గాని, కనీసం అసెంబ్లీలో మాట్లాడే స్థానం అయినా మిగిలితే బాగుంటుంది.” పార్టీ భవిష్యత్తు గురించి కార్యకర్తలే నమ్మకం కోల్పోయిన స్థితి ఇదైతే, జగన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ పూర్తిగా గుంగుబాటు లోకి వెళ్లిపోయింది. జిల్లా నాయకులు కనిపించరంటే కనిపించరు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలే లేవు. అధిష్టానం ఎక్కడో దూరంగా ఉండిపోతూ, ‘మీ బాధలు మాకు పట్టవు’ అన్నట్లుగా వ్యవహరించటం ప్రజల్లో కోపం కక్కించింది. ఇంతలో ఇంట్లోనే గొడవలు. తల్లి విజయమ్మ, చెల్లెలు శర్మిలలను ప్రజలు గౌరవంగా చూస్తారు. కానీ జగన్ తీసుకున్న వైఖరి — కోపం రేపింది. ఆ కుటుంబం పేరు మీదే ఓట్లు తెచ్చుకున్న ఆయన, అదే కుటుంబాన్ని అవమానించడమే ప్రజలలో తీవ్ర నమ్మక లోపాన్ని తెచ్చింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు జగన్‌పై పూర్తిగా వెనుదిరిగిపోయారు. అంతటితో ఆగలేదు. ఇప్పుడు **లిక్కర్ స్కాం** పార్టీ మీద ముద్ర వేసింది. ఏ ఒక్క నేత స్పందించలేరు. ఎవ్వరూ ఖండించలేదు. జగన్ పేరు ఇందులో వస్తుందోనన్న భయం కార్యకర్తల్లో జీర్ణంగా మారిపోయింది. **బెయిల్ రద్దు, అరెస్ట్ అనే మాటలు పార్టీ గోడలకే వినిపిస్తున్నాయి**. పార్టీ నైతికంగా విరిగిపోయింది, శారీరకంగా తుడిచిపెట్టబడింది. — ### **జగన్‌కు ఇక సీఎం ఛాన్స్ లేదు – YSRCPకి చివరి ఆశ ప్రతిపక్ష హోదా మాత్రమే** ఈ ఎన్నికలు జగన్‌కు రాజకీయంగా **పూర్తి చెక్‌మేట్**. ప్రజలు తలుపు మూసేశారు. తిరిగి ముఖ్యమంత్రి అవ్వడమే కాదు, రాజకీయంగా పునరుద్ధరణ జరగడం కూడా గగనసంచారమే. ఇప్పుడు YSRCPకి మిగిలిన ఆశ – **“ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా?”** అనే చిన్న ఆశ. అదే కూడా ప్రసక్తిలో లేదు అన్నదే వాస్తవం. ప్రజలు సంక్షేమం అంటే డబ్బుల కుప్పలు కాదు — అవి ఆత్మగౌరవానికి, జీవన ప్రమాణాల మెరుగుదలకి దోహదపడాలి. కానీ జగన్ ప్రభుత్వం ఆ ఆశల్ని అవమానాలుగా మార్చింది. ప్రజల గుండెల్లో జగన్ రాజకీయం వ్యతిరేకతగా మారిపోయింది. ఆ వ్యతిరేకత ఓట్లుగా మారి, పార్టీనే చిదిమేసింది. ఇదే తుది తీర్పు. ఫ్రీబీ పాలకుడికి, ప్రజల చేతి గుణపాఠం.

    1. 🛑 ప్రజల తీర్పు స్పష్టంగా చెప్పింది:

      జగన్ ముగిసిపోయాడు.

      175 స్థానాల్లో 11 సీట్లు మాత్రమే. ఇది ఓటమి కాదు.

      ఇది ప్రజల చేతి తీర్పు. శిక్ష. తిరస్కారం.

      👉 సంక్షేమం పేరుతో అభివృద్ధిని తాకట్టు పెట్టాడు.

      👉 ప్రజలను బానిసలుగా భావించి పథకాలతో మాయ చేశాడు.

      👉 కుటుంబాన్ని పక్కన పెట్టి, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు.

      👉 పార్టీ నేతలు, కార్యకర్తలే ఆయన మీద నమ్మకం కోల్పోయారు.

      👉 ఇప్పుడు ఆశలూ లేవు, అవకాశాలూ లేవు. “CM కాదు… ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా?” అనే స్థితి.

      📌 ఇంతలో… లిక్కర్ స్కాం.

      ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ప్రభుత్వం!

      ఇప్పుడు ప్రశ్నలు ఇదే:

      బెయిల్ రద్దవుతుందా? అరెస్ట్ అవుతాడా?

      ✅ ప్రజలు మేలుకున్నారు.

      ✅ ఫ్రీబీలు తక్కువ… భవిష్యత్తు ముఖ్యం అన్న తీర్పు.

      ✅ జగన్‌కు ఇక తిరిగి వచ్చే అవకాశమే లేదు.

      #జగన్Finished

      #FreebiePoliticsDead

      #AndhraVotesForChange

      #YSRCPCollapse

      #PeoplePower

  2. 🛑 ప్రజల తీర్పు స్పష్టంగా చెప్పింది:

    జగన్ ముగిసిపోయాడు.

    175 స్థానాల్లో 11 సీట్లు మాత్రమే. ఇది ఓటమి కాదు.

    ఇది ప్రజల చేతి తీర్పు. శిక్ష. తిరస్కారం.

    👉 సంక్షేమం పేరుతో అభివృద్ధిని తాకట్టు పెట్టాడు.

    👉 ప్రజలను బానిసలుగా భావించి పథకాలతో మాయ చేశాడు.

    👉 కుటుంబాన్ని పక్కన పెట్టి, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు.

    👉 పార్టీ నేతలు, కార్యకర్తలే ఆయన మీద నమ్మకం కోల్పోయారు.

    👉 ఇప్పుడు ఆశలూ లేవు, అవకాశాలూ లేవు. “CM కాదు… ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా?” అనే స్థితి.

    📌 ఇంతలో… లిక్కర్ స్కాం.

    ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ప్రభుత్వం!

    ఇప్పుడు ప్రశ్నలు ఇదే:

    బెయిల్ రద్దవుతుందా? అరెస్ట్ అవుతాడా?

    ✅ ప్రజలు మేలుకున్నారు.

    ✅ ఫ్రీబీలు తక్కువ… భవిష్యత్తు ముఖ్యం అన్న తీర్పు.

    ✅ జగన్‌కు ఇక తిరిగి వచ్చే అవకాశమే లేదు.

    #జగన్Finished

    #FreebiePoliticsDead

    #AndhraVotesForChange

    #YSRCPCollapse

    #PeoplePower

  3. అదేమిటి ఏ పార్టీ కి రాజీనామా చేశారో ఆ పార్టీ కి చీమ కుట్టినట్లు కూడా లేదు కానీ…రాష్ట్రం లో మిగితా పార్టీలకి, వర్గాలకి అందరికి షాక్ …షాక్ ….షాక్ ..షాక్ 

  4. నువ్వు సూపర్ ఎహె….ఇంగ్లీష్ వెర్షన్ లో వైసీపీ కి సెట్ బ్యాక్…తెలుగు వెర్షన్ లో టీడీపీ కి షాక్

  5. రాజీనామా చేసింది వైసీపీ కి, జాయిన్ అయ్యింది బీజేపీ లో. షాక్ ఏమైనా తగిలితే అది బీజేపీ కొ లేక వైసీపీ తగులుతుంది , మధ్యలో టీడీపీ ఎలా షాక్ అవుతుంది. ఇలానే 2019-2024 లో ఏమి జరిగిన టీడీపీ షాక్ అని రాసి అన్నయ్య నీ , ఆయన ఫ్యాన్స్ నీ ఎర్రి**పప్పాలని చేశావు

  6. జూన్ 4th 2024 లో కూడా ఇలాగే రాసావు వైసీపీ ఓడిపోయింది – టీడీపీ కి షాక్ అని. ఏంటో ఎక్కడ ఏమి జరిగిన కూడా టీడీపీ కె షాక్ !

Comments are closed.