బాబీ.. మెగా.. మళ్లీ తెర మీదకు

కెవిఎన్ కు బాబీ కి ఓ మాట కుదిరింది. ఇక కుదరాల్సింది మెగాస్టార్ తో

డాకూ మహరాజ్ తరువాత వెంటనే మరో సినిమా ఎక్కించాలని దర్శకుడు బాబీ చేయని ప్రయత్నాలు లేవు. కానీ హీరోలు ఖాళీగా లేరు. అయితే మెగాస్టార్ లేదంటే బాలయ్యతోనే చేసేందుకు ఎక్కువ అవకాశం వుంది. కానీ బాలయ్య రెండు సినిమాలు ఓకె చేసేసి వున్నారు. పైగా ఢాకూ మహరాజ్ పెద్ద హిట్టూ కాదు. దాంతో బాబీకి మిగిలిన ఏకైక ఆప్షన్ మెగాస్టార్ మాత్రమే.

ఆయన రెడీగానే వున్నారు. కానీ నిర్మాతలు రెడీగా లేరు. దర్శకుడు బాబీ మీద వున్న విమర్శ ఏమిటంటే డబ్బులు భారీగా ఖర్చు చేయించేస్తారని. ఢాకూ మహరాజ్ కూడా అదృష్టం కొద్దీ నాన్ థియేటర్ ఆదాయం వల్ల నిర్మాత బయటపడిపోయారు. అందరూ నాగవంశీలు కాదు కాదు కదా నాన్ థియేటర్ ఆదాయం పక్కా ప్లాన్డ్ గా తెచ్చుకోవడానికి.

అందుకే చాలా మంది నిర్మాతలు ఈ కాంబినేషన్ పట్ల అంత ఆసక్తి చూపించలేదని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు కన్నడ నిర్మాణ సంస్థ కెవిఎన్ ముందుకు వచ్చిందని తెలుస్తోంది. ఈ సంస్థ ఎప్పటి నుంచో తెలుగు సినిమారంగంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. చాలా మందికి అడ్వాన్స్ లు కూడా ఇచ్చింది. మెగాస్టార్ దగ్గర కూడా అడ్వాన్స్ వుంది.

కెవిఎన్ కు బాబీ కి ఓ మాట కుదిరింది. ఇక కుదరాల్సింది మెగాస్టార్ తో. ప్రస్తుతం ఆయన విదేశాల్లో వున్నారు. రాగానే డిస్కషన్లు వుంటాయని, అవి ఫలప్రదం అయితే ప్రాజెక్ట్ ఫిక్స్ అని తెలుస్తోంది.

6 Replies to “బాబీ.. మెగా.. మళ్లీ తెర మీదకు”

      1. ఫ్యామిలీ ఏంట్రా మధ్యలో.. మీ ఫ్యామిలీ నిన్నిలా పెంచిందేంటి

Comments are closed.