అరెస్ట్‌ల‌పై కూట‌మి త‌ప్పిదం ఇదే!

ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌కుండా, కేవ‌లం ప్ర‌త్య‌ర్థులంద‌రిపై కేసులు పెట్టి వేధించ‌డానికే పాల‌న సాగిస్తోంద‌న్న అభిప్రాయం ఏర్ప‌డింది.

కూట‌మి ప్ర‌భుత్వం క‌క్ష‌పూరిత పాల‌న సాగిస్తోంద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. లోకేశ్ రెడ్‌బుక్ పాలనే త‌ప్ప‌, అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగం ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ్య‌వ‌స్థ‌లు న‌డ‌వ‌లేద‌నే విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. అతి మంచిది కాద‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. అరెస్ట్‌ల విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం అతి చేస్తోంద‌న్న భావ‌న ప్ర‌జానీకంలో ఏర్ప‌డింది.

నారా లోకేశ్ కుప్పం నుంచి యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టారు. తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు చేసే మంచి ఏంటో చెప్పి, ఆక‌ట్టుకోవ‌డం వ‌ర‌కూ ఓకే. ప‌నిగా ప‌నిగా ఆయ‌న రెడ్‌బుక్ కూడా రాసుకుంటూ వ‌చ్చారు. త‌మ‌ను ఇబ్బందుల‌పాలు చేసిన అధికారులు, నాయ‌కుల పేర్ల‌ను ప్ర‌ముఖంగా రెడ్‌బుక్‌లో నోట్ చేసుకున్నారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రెడ్‌బుక్ పాల‌న మొద‌లైన‌ట్టు స్వ‌యంగా లోకేశే ప్ర‌క‌టించారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో కూడా లోకేశ్ మాట్లాడుతూ రెడ్‌బుక్‌లో ఇప్పుడు ఎన్నో చాప్ట‌ర్ మొద‌ల‌వుతున్న‌దో కూడా చెప్పారు. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లతో రాష్ట్రానికి న‌ష్ట‌మే త‌ప్ప‌, లాభం లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

కొంద‌రు పెద్ద నాయ‌కుల్ని అరెస్ట్ చేసినా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోరు. కానీ వైసీపీ అయితే చాల‌న్న‌ట్టుగా, క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రిపై కేసులు పెడుతూ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నార‌న్న అభిప్రాయం బ‌ల‌ప‌డింది. ఈ ధోర‌ణే ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకొస్తోంది. అప‌రిమిత‌మైన అధికారం ఇచ్చింది… ప్ర‌తీకారం తీర్చుకోడానికో, వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు నెర‌వేర్చుకోడానికో కాదు క‌దా అనే చ‌ర్చ మొద‌లైంది.

ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌కుండా, కేవ‌లం ప్ర‌త్య‌ర్థులంద‌రిపై కేసులు పెట్టి వేధించ‌డానికే పాల‌న సాగిస్తోంద‌న్న అభిప్రాయం ఏర్ప‌డింది. ఏ ఒక్క వైసీపీ కార్య‌క‌ర్త‌, నాయ‌కుల్ని వ‌దిలి పెట్ట‌కూడ‌ద‌నే అత్యుత్సాహమే కూట‌మి కొంప ముంచ‌నుంద‌నే మాట ఎక్కువ‌గా వినిపిస్తోంది.

11 Replies to “అరెస్ట్‌ల‌పై కూట‌మి త‌ప్పిదం ఇదే!”

  1. ఒక్కరి పేరు చెప్పు అమయకులని ఎవరిని అరెస్ట్ చేశారో? లిక్కర్ స్కామ్ లో ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి మేము చెయ్యలేదు..మాకు సంబంధం లేదు అని ఒక్కళ్ళు కూడా చెప్పడం లేదే?దమ్ముంటే ప్రూవ్ చేసుకోండి అని మాత్రమే చెప్తున్నారు:)

  2. asalu ippati varaku peddl0lanu l0pala veyyaledu antunnara??? lekapote ippati varaku vesinllu pedd0llu kadu ani certify chestunnara ani netijanulu adugutunnaru

  3. రెడ్ బుక్ అని చెప్పే గెలిచారు, టీడీపీ ఇప్పటివరకు చాల సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది .. ఇప్పుడు మాత్రమే ఎందుకు రెడ్ బుక్ అంటున్నారు ..ఆలా వాళ్ళని తయారు చేసింది ఎవరు .. సమాధానం నీకు తెలుసు అయినా మోయాలి పల్లకి తప్పదు నీకు ..

  4. వీళ్ళందరూ ఉమ్మడిగా నిత్యానంద గారి కైలాస దేశం పాస్ పోర్ట్ లు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళి 2029 ఎలక్షన్ కి వచ్చి వెళితే మంచిదేమో 2029 లో కూడా ఎటు ఓడిపోతారు డబ్బు ఫుల్ గ నొక్కేసింది వుంది కాబట్టి అక్కడ రంజిత వంటివారిని సేవించుకోవచ్చు

  5. ప్రజానీకం అంటే ఓ తూరి షెప్పరా గ్యాసాంధ్రా… నీ టముకూ పేపర్ చదివే ప్రజనీకం అంటున్నావా.. వాళ్ళు మహా అంటే 0.00001% వుంటారు…  వాళ్లేనా

Comments are closed.