దర్శకుడికి పవర్ స్టార్ సూచనలు?

రెగ్యులర్ గా సినిమాల్లో వుండే సాదా సీదా కామెడీ కానీ, మరీ హీరోయిజం ఎలివేట్ చేసే పంచ్ డైలాగులు కానీ వద్దు అని చెప్పినట్లు వినిపిస్తోంది.

హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే గబ్బర్ సింగ్ గుర్తు వస్తుంది. అందులో ఎంటర్ టైన్ మెంట్, పంచ్ డైలాగులు గుర్తుకు వస్తాయి.

వీటితో పాటే హీరో ఎలివేషన్లు కూడా. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఇవే వుంటాయని అందరూ భావించడం కామన్. అయితే ఇప్పుడు వాటి విషయంలో పవర్ స్టార్ పవన్ ఓ పరిమితి విధించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా వున్నారు. సనాతన ధర్మాన్ని గట్టిగా ప్రబోధిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో వుంచుకునే సినిమా డైలాగులు అన్నీ వుండాలని చెప్పినట్లు తెలుస్తోంది.

రెగ్యులర్ గా సినిమాల్లో వుండే సాదా సీదా కామెడీ కానీ, మరీ హీరోయిజం ఎలివేట్ చేసే పంచ్ డైలాగులు కానీ వద్దు అని చెప్పినట్లు వినిపిస్తోంది.

ప్రస్తుతం యూనిట్ స్ట్రిప్ట్, డైలాగ్ వెర్షన్ ఫైన్ ట్యూనింగ్ పని మీద బిజీగా వున్నట్లు తెలుస్తోంది. జూన్ రెండో వారంలో సెట్ మీదకు పవర్ స్టార్ వస్తారని టాక్ వుంది. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూలు మీద ఆధారపడి వుంటుంది ఇదంతా.